నాగర్ కర్నూలు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. భూదాన్ భూముల స్కామ్‌లో జనార్దన్ రెడ్డితో పాటు వంశీకాం బిల్డర్స్ సుబ్బారెడ్డి, ఆమోద డెవలపర్స్‌కి చెందిన సూర్య తేజ, కె.ఎస్.ఆర్ మైన్స్‌కు చెందిన సిద్దారెడ్డికి కూడా ఈడీ నోటీసులు పంపింది. వీరిందరూ డిసెంబర్ 16న హాజరు కావాలని ఈడీ నోటీసులో తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అమోయ్ కుమార్‌ను పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఇది కూడా చూడండి: TN: తమిళనాడు ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం– ఆరుగురు మృతి Amoy Kumar case: ED summons BRS ex-MLA & Vamsiram Builders The Enforcement Directorate (ED) on Thursday summoned B Subba Reddy of Vamsiram Builders and former BRS MLA Marri Janardhan Reddy, along with two other developers, in connection with an alleged land case linked to IAS… pic.twitter.com/6zh1gnwAnl — Sudhakar Udumula (@sudhakarudumula) December 13, 2024 ఇది కూడా చూడండి: Japan: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం 50 ఎకరాల భూమిని దానం చేయగా.. ఇదిలా ఉండగా సర్వే నంబర్‌లోని 181, 182 లో 102.2 ఎకరాలపై గత కొంత కాలం నుంచి వివాదం ఉంది. అయితే ఇందులో 50 ఎకరాల భూమి భూదాన్ బోర్డుకు చెందినదని అంటోంది. మొదట్లో ఈ భూమి జబ్బార్దస్త్ ఖాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ కాగా.. ఆ తర్వాత అతని కొడుకు హజీ ఖాన్ 50 ఎకరాల భూమిని భూదాన్ బోర్డుకు దానం చేశారు. కానీ 2021లో ఓ మహిళ హజీఖాన్ వారసురాలిని అని 40 ఎకరాలు తనవేనని తెలిపింది. దీంతో ఆ మహిళ మీద రిజిస్ట్రేషన్ జరిగ్గా.. ఆమె ఈ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇది కూడా చూడండి: Hyderabad: న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే! ఇది కూడా చూడండి: Allu Arjun: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్