ఫార్ములా- ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల కిందటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి ఫైల్ అందినట్లు సమాచారం. గవర్నర్ నుంచి ఆమోదం రావడంతో ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Japan: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఫార్ములా-ఈ రేసులో ఉల్లంఘణలు జరిగాయని..
హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా-ఈ కార్ రేసు నిర్వహణలో ఉల్లంఘణలు జరిగాయని కేటీఆర్ మీద ఆరోపణలు ఉన్నాయి. నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందు నిధులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధమని విచారణ చేపట్టాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. హెచ్‌ఎండీఏ అనుమతి లేకుండా ఈ కారు సంస్థకు రూ. 46 కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించారు.
ఇది కూడా చూడండి: Hyderabad: న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే!
దీంతో కేటీఆర్, అప్పటి పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌పై ఎణ్‌ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలని ఏసీపీ ప్రభుత్వానికి గత నెలలోనే లేఖ రాసింది. న్యాయ సలహా తీసుకున్న తర్వాతే గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫార్ములా-ఈ కారు రేస్‌పై ఇప్పటికే పురపాలక శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్‌ను నోటీసులు పంపించారు. అలాగే చీఫ్ ఇంజనీర్‌ను కూడా ఏసీబీ విచారించింది. ఇప్పుడు మళ్లీ గవర్నర్ ఆమోదంతో కేసు మరో మలుపు తిరగబోతోంది.
ఇది కూడా చూడండి: TN: తమిళనాడు ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం– ఆరుగురు మృతి
ఇదిలా ఉండగా.. భారత్‌లో మొదటిసారిగా ఫార్ములా ఈ రేసింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరాన ఫార్ములా ఈ-కార్ రేస్ 2023 ఫిబ్రవరి 11న జరిగింది.
ఇది కూడా చూడండి: Allu Arjun: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్