అలా అయితే సగం మంది రాజకీయ నాయకులు జైలుకే! బ్రహ్మాజీ సంచలన వ్యాఖ్యలు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం పై నటుడు బ్రహ్మాజీ మండిపడ్డారు. "దేశంలో చాలా చోట్ల తొక్కిసలాట జరిగింది. ఎవరినైనా అరెస్ట్ చేశారా..? అలా చేస్తే సగం మంది రాజకీయ నాయకులు జైలుకు వెళ్తారు" అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

New Update

Brahmaji:  సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఈరోజు హీరో అల్లు అర్జున్ ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. డిసెంబర్ 4న 'పుష్ప2'  ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ రావడంతో భారీగా తొక్కిసలాట జరిగి.. రేణుక అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి బన్నీని అరెస్టు చేసిన పోలీసులు ఆయన పై 105 సెక్షన్ ప్రకారం నాన్ బెయిల్ కేసు,  BNS 118(1) రెడ్ విత్ 3/5 పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే అల్లు అర్జున్ అరెస్టు చేయడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు రాజకీయ నాయకులు ఆయన అరెస్టును, అరెస్టు చేసిన తీరును ఖండిస్తున్నారు. 

నటుడు బ్రహ్మాజీ పోస్ట్.. 

తాజాగా బన్నీ అరెస్ట్ పై టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం పై మండిపడ్డారు. "దేశంలో చాలా చోట్ల తొక్కిసలాట జరిగింది. ఎవరినైనా అరెస్ట్ చేశారా..? అలా చేస్తే సగం మంది రాజకీయ నాయకులు జైలుకు వెళ్తారు" అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అల్లు అర్జున్ అరెస్టు పై నాని ట్వీట్.. 

''సినిమా వాళ్లకు సంబంధించిన విషయాలపై ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే ఉత్సాహం సాధారణ ప్రజల పై కూడా ఉండాలని కోరుకుంటున్నాను.  మనమంతా ఒక మంచి సమాజంలో జీవించాలి. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతి చెందడం దురదృష్టకర, హృదయ విదారక ఘటన.  దీని నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మనందరి తప్పు ఉంది.. ఒక వ్యక్తిని నిందించడం కరెక్ట్ కాదు" అంటూ నాని ట్వీట్ చేశారు. 

Also Read: మంచు ఫ్యామిలీ వివాదాలకు సౌందర్యతో లింక్.. అసలు విషయం తెలిస్తే షాక్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు