RBI: ఆర్బీఐ గవర్నర్‌కు బాంబు బెదిరింపులు

రిజ్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పేల్చేస్తామంటూ గవర్నర్‌కు ఈ-మెయిల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు రష్యన్ భాషలో గవర్నర్‌కు మెయిల్ చేశారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మెయిల్ చేసిన వ్యక్తి కోసం విచారణ చేపట్టారు.

New Update
ICICI, Kotak బ్యాంకులకు RBI షాక్.. భారీగా జరిమానా.. ఎందుకంటే?

ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటి వరకు విమానాలు, స్కూళ్లకు బెదిరింపులు రాగా.. తాజాగా ఆర్బీఐ గవర్నర్‌‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. రిజ్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)ను పేల్చేస్తామంటూ గవర్నర్‌కు ఈ-మెయిల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు రష్యన్ భాషలో ఈ మెయిల్‌ను పంపించారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ-మెయిల్ ఎవరూ పంపారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. 

ఇది కూడా చూడండి: Japan: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

గతంలో కూడా ఓసారి..

ఇదిలా ఉండగా ఇటీవల కూడా ఆర్బీఐ కస్టమర్ కేర్ నంబర్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. నవంబర్ 16వ తేదీన కూడా ఓ వ్యక్తి కాల్ చేసి లష్కరే-ఇ-తైబా సీఈఓ అని తెలిపారు. దానికంటే ముందు వారు ఫోన్‌లో పాట పాడారు. అయితే లష్కరే తోయిబా అనేది ఒక ఉగ్రవాద సంస్థ. ముంబైలో 2008లో దాడులను నిర్వహించింది. భారతదేశంలోని అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడులలో ఇది ఒకటి. 

ఇది కూడా చూడండి: Hyderabad: న్యూ ఇయర్‌ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే!

ఇది వరకు ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తి కాంత్ దాస్ ఉండేవారు. కానీ ఇటీవల సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ 26వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇలా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల తర్వాత ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో కాస్త ఆందోళన చెందుతున్నారు. ఆరేళ్లపాటు పదవిలో ఉన్న శక్తికాంత దాస్‌ స్థానంలో ఈయన నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారి మల్హోత్రాను ఎంపిక చేసింది.

ఇది కూడా చూడండి: Allu Arjun: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్

ఇది కూడా చూడండి: TN: తమిళనాడు ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం– ఆరుగురు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు