అల్లు అరెస్ట్‌పై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిదని అన్నారు. అదే సమయంలో దీనిపై జగన్ తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. Also Read: అల్లు అర్జున్ అరెస్ట్‌కి ముందు టైం టు టైం ఏం జరిగిందంటే..? అయితే ఈ ఘటనకు సంబంధించి నేరుగా అల్లు అర్జున్‌ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదన్నారు. ఈ మేరకు అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను అని ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. Also Read: అల్లు అర్జున్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. మధ్యంతర బెయిల్ మంజూరు హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై @alluarjun తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని… — YS Jagan Mohan Reddy (@ysjagan) December 13, 2024 అల్లు అర్జున్ అరెస్టు పై పలువురి రియాక్షన్స్ Also Read: అల్లు అర్జున్ అరెస్టుపై వై ఎస్ జగన్ సంచలన ట్వీట్.. రష్మిక రియాక్షన్ తాజాగా ఈ విషయంపై పుష్ప–2 హీరోయిన్ రష్మిక మందన్నా రియాక్ట్ అయారు. ""నేనేం చూస్తున్నానో నాకు అర్ధం కావడం లేదు. సంధ్య థియేటర్ దగ్గర జరిగినది చాలా విషాదకరమైన సంఘటన. అలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి. కానీ ఆ మొత్తం ఘటనకు అల్లు అర్జున్ ఒక్కడినే బాధ్యుడిని చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు"" అని అన్నారు రష్మిక. ""నేనసలు నమ్మలేకపోతున్నా.. నాకు ఈ విషయం చాలా హార్ట్ బ్రేకింగ్‌గా ఉంది"" అంటూ రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. బ్రహ్మాజీ Also Read: జైలుకు అల్లు అర్జున్.. 14 రోజులు రిమాండ్! తాజాగా బన్నీ అరెస్ట్ పై టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం పై మండిపడ్డారు. "దేశంలో చాలా చోట్ల తొక్కిసలాట జరిగింది. ఎవరినైనా అరెస్ట్ చేశారా..? అలా చేస్తే సగం మంది రాజకీయ నాయకులు జైలుకు వెళ్తారు" అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.