ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న విడుదలైంది. ఈ మూవీకి ముందు రోజు అంటే డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్స్‌లో ప్రీమియర్స్ వేశారు. ఆ సమయంలో ఓ మహిళ మృతి చెందింది. బన్నీ వస్తున్నాడన్న సమచారంతో ఆ థియేటర్ వద్దకు ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో హైదరాబాద్‌లోని ఎల్‌బి నగర్‌కు చెందిన రేవతి మృతి చెందింది. దీంతో అల్లు అర్జున్, థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. Also Read: హైదరాబాద్ మోస్ట్ వాంటెడ్ గంజాయి లేడీ డాన్ అరెస్టు అల్లు అర్జున్ కేసు ఈ కేసులో భాగంగానే ఇవాళ (శుక్రవారం) పోలీసులు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసును విచారించిన కోర్టు అల్లు అర్జున్‌కి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బన్నీని చంచల్‌గూడ జైలుకి తరలించారు. మరోవైపు ఈ కేసును హైకోర్టు సైతం విచారించింది. ఈ విచారణలో భాగంగా బన్నీకి రూ.50 వేల పూచికత్తుతో, 4 వారాల ముందస్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. దీంతో బన్నీ జైలు నుంచి బయటకు వచ్చాడు. గతంలో షారుఖ్ ఖాన్ కేసు అయితే ఇలాంటి కేసే ఒకటి గతంలో మరో స్టార్ హీరోకి చుట్టుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సైతం ఇలాంటి కేసులోనే ఇరుక్కున్నారు. గుజరాత్‌లోని వడోదరలో 2017 లో షారుఖ్ ఖాన్ "రాయిస్" మూవీ ప్రమోషన్స్‌లో ఓ వ్యక్తి మరణించాడు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా షారుఖ్ తన మూవీ యూనిట్‌తో కలిసి ముంబై నుంచి ఢిల్లీకి ట్రైన్‌లో ప్రయాణించాడు. Also Read: అల్లు అర్జున్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. మధ్యంతర బెయిల్ మంజూరు అలా ప్రయాణిస్తున్న సమయంలో వడోదర రైల్వే స్టేషన్‌లో షారుఖ్‌ని చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో అభిమానుల్ని చూసి షారుఖ్ పరవశించిపోయాడు. ఆపై టీ షర్టులు, స్మైలీ బాల్స్ వారిపై విసిరాడు. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. అదే సమయంలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఓ వ్యక్తి మరణించాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు వడోదర కోర్టులో షారుక్‌పై కేసు వేశారు. అయితే ఆ కేసును కొట్టేయాలని కోరుతూ గతంలో షారుఖ్ ఖాన్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన కోర్టు 2022లో షారుఖ్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై నమోదైన క్రిమినల్ కేసులు కొట్టేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.