Rashmika: నేను నమ్మలేకపోతున్నా–రష్మిక

అసలేం జరుగుతోంది నేను నమ్మలేక పోతున్నా. ఈ మొత్తం సంఘటన నా హృదయాన్ని ముక్కలు చేసింది అంటూ అల్లు అర్జున్ అరెస్ట్‌పై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రియాక్ట్ అయ్యారు. ఒక్క వ్యక్తిని బలి చేయడం అన్యాయం అంటూ వాపోయారు. 

author-image
By Manogna alamuru
New Update
Rashmika Mandanna: నటిగా నా ఆకలి తీర్చిన సినిమా అదే అంటున్న రష్మిక!

 అల్లు అర్జున్ అరెస్ట్ సినిమా ఇండస్ట్రీని పెద్ద కుదుపుకు లోను చేసింది. దీనిపై  నటులు ఒక్కొక్కరే స్పందిస్తున్నారు. జరిగిన దానిలో అల్లు అర్జున్‌ ఒక్కడే బాధ్యుడిగా ఎంచడం తప్పు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై పుష్ప–2 హీరోయిన్ రష్మిక మందన్నా రియాక్ట్ అయ్యారు. నేనేం చూస్తున్నానో నాకు అర్ధం కావడం లేదు. సంధ్య థియేటర్ దగ్గర జరిగినది చాలా విషాదకరమైన సంఘటన.  అలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి. కానీ ఆ మొత్తం ఘటనకు అల్లు అర్జున్ ఒక్కడినే బాధ్యుడిని చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అన్నారు రష్మిక. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడాన్నినేనసలు నమ్మలేకపోతున్నా. నాకు ఈ విషయం చాలా హార్ట్ బ్రేకింగ్‌గా ఉంది అంటూ రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. 

 

 

సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్జు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం జూబ్లిహిల్స్ లోని తన ఇంటి వద్దే చిక్కడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'పుష్ప2' సినిమా చూసేందుకు వచ్చిన మహిళా అభిమాని మరణించిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 105 సెక్షన్ ప్రకారం నాన్ బెయిల్ కేసు నమోదైంది. 

అసలేమైంది..

 పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదలవగా డిసెంబర్ 4న ప్రిమియర్ షో చూసేందుకు అల్జు అర్జున్ సంథ్య థియేటర్ వెళ్లాడు.  ఈ క్రమంలోనే తమ అభిమాన హీరోను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే రేవతి అనే మహిళా తన కొడుకు, భర్తతో కలిసి సంథ్య థియేటర్ కు వచ్చారు. అయితే అభిమానుల తాకిడి ఎక్కువకావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి, 7 ఏళ్ల శ్రీ తేజ్ కిందపడిపోయారు. ఈ తొక్కిసలాటలో రేవతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. శ్రీ తేజ్ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. 

  Also Read: అల్లు అర్జున్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. మధ్యంతర బెయిల్ మంజూరు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు