కేంద్ర కేబినెట్ జమిలి ఎన్నికల బిల్లుకు గురువారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చేవారమే ఈ బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానాన్ని కొన్ని పార్టీలు సమర్థిస్తుండగా మరికొన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల అస్థిత్వాన్ని అణిచివేసేందుకే మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని విమర్శిస్తున్నారు. జమిలి ఎన్నికలు అంటే ఏంటి ? అవి ఎప్పుడు జరిగాయి? అనే విషయాలన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్
జమిలి ఎన్నికలు అంటే ?
దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడాన్నే జమిలి ఎన్నికలు అంటారు. భారత్‌కు 1947లో స్వాతంత్ర్యం వచ్చిన సంగతి తెలిసిందే. మొదటిసారిగా 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి 21 వరకు జరిగాయి. ఆ సమయంలో దేశమంతటా ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల జరిగాయి. ఆ తర్వాత 1957, 1962, 1967లో కూడా జమిలి ఎన్నికలే జరిగాయి.
ఇది కూడా చూడండి: న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే!
ఆ తర్వాత పలు కారణాల వల్ల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయాయి. దీంతో అక్కడ మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. దీంతో 1967 వరకు జరిగిన జమిలి ఎన్నికలకు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత ఒక్కో ఏడాది వివిధ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. అయితే 1980లో దేశంలో జమలి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత 1999లో లా కమిషన్ కూడా జమిలి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. అప్పుడు దీనికి ముందడుగులు పడలేదు.
2014 పార్లమెంటు ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీ మళ్లీ జమిలి ఎన్నికల అంశాన్ని లేవనెత్తింది. తాము అధికారంలోకి వస్తే జమిలి ఎన్నికలను నిర్వహిస్తామని మెనిఫెస్టోలో ప్రకటించింది. గత కొన్నేళ్లుగా బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెబుతూనే ఉంది. చివరికి మోదీ ప్రభుత్వం జమిలి ఎన్నికల కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఓ కమిటీని ఏర్పాటు చేసింది. పలు రాజ్యాంగ సవరణలు చేసి దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని ఈ కమిటీ సూచించింది.
Also Read: భార్యల వేధింపులకు భర్తలు బలి.. ఎన్ని ఘోరాలు జరిగాయంటే?
2027 లేదా 2028లో జమిలి ఎన్నికలు
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఈ జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిదే 2027 లేదా 2028లో జమిలి ఎన్నికలను నిర్వహించాలని మోదీ సర్కార్ యోచిస్తోంది. అయితే ఈ ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) జరగాలి. అలాగే మహిళా రిజర్వేషన్ల బిల్లును కూడా అమలు చేయాలి. ఇవన్నీ జరిగిన తర్వాతే జమిలి ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జమిలి ఎన్నికలు సౌతాఫ్రికా, బెల్జియం, స్విడన్ వంటి దేశాల్లో కూడా జరుగుతున్నాయి.
ఇదిలాఉండగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణ భారత్‌కు తక్కువ ఎంపీ స్థానాలు వస్తాయని, ఉత్తర భారత్‌కు ఎక్కువ స్థానాలు వస్తాయనే విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ అంత ఫోకస్ పెట్టకపోయినా.. ఉత్తర భారత్‌లో పెరిగే ఎంపీ సీట్లతోనే ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రయోజనం ఉంటుందని ఆరోపిస్తున్నారు. కుటుంబ నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు డిలిమిటేషన్ ప్రక్రియ వల్ల అన్యాయం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం డిలిమిటేషన్ ప్రక్రియలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాలంటే లోక్‌సభ, రాజ్యసభలో దీనిపై ఓటింగ్ జరుగుతుంది. ఇందుకోసం మూడింట రెండొంతుల మంది సభ్యులు మెజార్టీ రావాలి. లోక్‌సభలో మొత్తం 545 మంది సభ్యులు ఉన్నారు. రెండొంతు అంటే దాదాపు 364 మంది ఎంపీలు జమిలి ఎన్నికల బిల్లుకు మద్దతుగా ఓటు వేయాలి. ఇక రాజ్యసభలో మొత్తం 245 మంది ఉంటారు. ఇందులో రెండొంతుల అంటే కనీసం 164 మంది సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేయాలి. అయితే ప్రస్తుతం ఎన్డీయేకు కేవలం లోక్‌సభలో 293 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. రాజ్యసభలో 125 మంది సభ్యుల బలం ఉంది. అయితే ఈ బిల్లు ఆమోదం పొందాలంటే ఎన్డీయే కూటమి ఇతర పార్టీల మద్దతు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మెజార్టీ ఓట్లు వచ్చినట్లేతే ఈ బిల్లు ఆమోదం పొందుతుంది. ఆ తర్వాత జమిలి ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమవుతుంది. ఈ ఎన్నికల విధానానికి 30కి పైగా పార్టీలు సమర్థించగా.. కాంగ్రెస్‌తో సహా 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
ఇది కూడా చూడండి: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఈ రాజ్యాంగ సవరణలు అవసరం
జమిలి ఎన్నికలు ఆమోదం పొందాలంటే పలు రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది.
1. లోక్‌సభ, రాజ్యసభ కాలపరిమితికి సంబంధించి ఆర్టికల్ 83 సవరణ
2. రాష్ట్రాల అసెంబ్లీలకు ఐదేళ్ల పాటు గడువును నిర్దేశించే ఆర్టికల్ 172(1) సవరణ
3. ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చినప్పుడు సభ కాలపరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 82(2) సవరణ
4. రాష్ట్రపతికి లోక్‌సభను రద్దు చేసే అధికారాలు ఇచ్చే ఆర్టికల్ 85(2)(బి) సవరణ
5. గవర్నర్‌కు రాష్ట్రాల అసెంబ్లీని రద్దు చేసేందుకు అధికారం ఇచ్చే ఆర్టికల్ 174(2)(బి) సవరణ
6. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356కి సవరణ
7. ఎన్నికల కమిషన్‌కు సంబంధించి ఆర్టికల్ 324 సవరణ