Manchu Manoj: మద్యం మత్తులో మంచు మనోజ్‌ గొడవ?

మంచు మనోజ్‌కు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరల్‌ అవుతుంది.ఆయన ఎవరో ఓ వ్యక్తితో తీవ్రంగా ఘర్షణ పడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఆ వీడియో చూసిన వారు కొందరు అందులో మనోజ్‌ తాగి ఉన్నాడని ఆరోపిస్తున్నారు.ఆయనని ఆపడానికి మోహన్‌ బాబు ప్రయత్నిస్తున్నట్లు కనపడుతుంది.

New Update

Manchu Manoj: మంచు వారి కుటుంబంలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో మనోజ్‌కు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరల్‌ అవుతుంది.ఆయన ఎవరో ఓ వ్యక్తితో తీవ్రంగా ఘర్షణ పడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఆ వీడియో చూసిన వారు కొందరు అందులో మనోజ్‌ తాగి ఉన్నాడని ఆరోపిస్తున్నారు.

Also Read: Mohan Babu: అయామ్‌ సారీ..మీడియాకి మోహన్ బాబు క్షమాపణలు!

అయితే ఈ గొడవ జరుగుతున్నప్పుడు మోహన్‌ బాబు కూడా పక్కనే ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన మనోజ్‌ ను ఆపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కనపడుతుంది.అయితే ఈ వీడియో ఇప్పటిది కాదని...ఎప్పుడో జరిగిందని...కుటుంబంలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో ఎవరో కావాలని దీనిని విడుదల చేసి వైరల్‌ చేస్తున్నారని నెటిజన్లు అంటున్నారు.

Also Read: Ap: ఏపీ పై అల్పపీడన ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జాగ్రత్త!

మంచు ఫ్యామిలీలో వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మొన్నటి వరకు నాలుగు గోడల మధ్య ఉన్న వీళ్ళ గొడవ..  ఇప్పుడు రచ్చకెక్కడం చర్చనీయాంశమైంది.  మంచు మనోజ్, తండ్రి మోహన్ బాబు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇంతటితో ఆగలేదు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం.. మరో వైపు మోహన్ బాబు.. ప్రశ్నించేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపై చేయి చేసుకోవడం రచ్చ రచ్చగా మారింది.

Also Read: Joe Biden: ఒక్కరోజే 1500 మందికి శిక్ష తగ్గింపు.. చరిత్ర సృష్టించిన బైడెన్

అంతా ఆమె వల్లే..

తన తండ్రి  మోహన్‌బాబుతో గొడవ గురించి మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. తమ గొడవలకు కారణం అంతా విష్ణు భార్య వెరోనికా, ఆమె కుటుంబ సభ్యుల వల్లనే అన్నారు. విష్ణు, వదిన కంపెనీలన్నీ వదిన వాళ్ల అమ్మ చూసుకుంటోంది. సీసీ రెడ్డి ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందేనన్నారు మనోజ్. వదిన వాళ్ల అమ్మ, నాన్నకు అమెరికాలో ఎంట్రీ లేదు. వాళ్లు అమెరికాకు వెళ్తే అరెస్టవుతారు. అందుకే వాళ్లు దుబాయిలో సెటిల్ అయ్యారు అంటూ చెప్పుకొచ్చారు. 

Also Read: Doctor Suicide: నిన్న టెకీ..నేడు డాక్టర్‌..రెండు ఒకటే!

మా నాన్న దేవుడు..

మా నాన్న చేసే పనుల చుట్టే విష్ణు వ్యాపారం సాగుతోంది. విష్ణు సోషల్‌మీడియా టీమ్‌..ట్రస్ట్‌ కిందే పని చేస్తుందని మనోజ్ అంటున్నారు.వినయ్ అనే వ్యక్తి వదిన వాళ్ల కుటుంబానికి సన్నిహితుడు. సీసీ కెమెరాల విషయంలో ఇతని గురించి ప్రత్యేకంగా వచ్చింది. తన నాన్నతో గొడవకు ఇతను కూడా ఒక కారణ అని మనోజ్ చెప్పారు.  ప్రస్తుతం తాను భైరవ సినిమా షూటింగ్‌లో ఉన్నానని మనోజ్ అన్నారు. తన తండ్రి మోహన్ బాబు దేవుడని...ఆయన తప్పేమీ లేదని అన్నారు. వదిన, వాళ్ళ కుటుంబ సభ్యుల వల్లనే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయని మనోజ్ అన్నారు. విష్షు, వదిన కలిపి అన్నీ కంట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. 

Advertisment
తాజా కథనాలు