ఈ రాత్రికి చంచల్‌గూడ జైల్లోనే అల్లు అర్జున్..!

అల్లు అర్జున్ రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది. ఇవాళ బన్నీ రిలీజ్ కాకపోవచ్చని అధికారులు అంటున్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల కాపీ జైలు అధికారులకు ఇంకా చేరలేదని సమాచారం. దీంతో ఇవాళ చంచల్‌గూడ జైలులోనే బన్నీ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

author-image
By Seetha Ram
New Update
ALLU

అల్లు అర్జున్ రిలీజ్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇవాళ అల్లు అర్జున్ రిలీజ్ కాకపోవచ్చని అధికారులు అంటున్నారు. అల్లు అర్జున్ ఈరోజు చంచల్‌గూడ జైల్లోనే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల కాపీ జైలు అధికారులకు ఇంకా చేరలేదని సమాచారం. అధికారికంగా బెయిల్ ఉత్తర్వులు తమకు అందలేదని జైలు అధికారులు అంటున్నారు. బెయిల్ ఉత్తర్వు కాపీలు ఇంకా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాలేదని జైలు అధికారులు చెబుతున్నారు. 

Also Read: హైదరాబాద్ మోస్ట్ వాంటెడ్ గంజాయి లేడీ డాన్ అరెస్టు

అల్లు అర్జున్ లాయర్లు తెచ్చిన బెయిల్ కాపీ సరిగా లేదని అధికారులు పేర్కొంటున్నారు. దీని కారణంగానే రిలీజ్ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. రాత్రి 10 గంటల వరకే జైలు సూపరింటెండెంట్ అందుబాటులో ఉంటాడని అంటున్నారు. ఆ లోపు సరైన బెయిల్ పత్రాలు వస్తేనే అల్లు అర్జున్‌ని విడుదల చేస్తామని జైలు అధికారులు అంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా క్లాస్ - 1 బ్యారక్‌ను జైలు అధికారులు సిద్ధం చేశారు. కాగా అల్లు అర్జున్‌కు జైలు సిబ్బంది టీ, స్నాక్స్ అందించినట్లు సమాచారం. ప్రస్తుతం మంజీరా బ్యారక్‌లో అల్లు అర్జున్ ఉన్నాడు. 

14 రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు 

అల్లు అర్జున్ కు బిగ్ షాక్ తగిలింది. సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 14 రోజులు రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో నాంపల్లి కోర్టు ఆదేశాలతో అల్లు అర్జున్‌ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. ట్రాఫిక్ క్లియర్ చేసి భారీ బందోబస్తు మధ్య ఆయన్ను జైలులోకి తీసుకెళ్లారు.

హైకోర్టు ఏం చెప్పింది..

అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని హైకోర్టు తెలిపింది. యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమని పేర్కొంది. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.

Also Read: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు

రేవతి కుటుంబంపై సానుభూతి ఉంది

కేవలం నటుడు కాబట్టే 105 (B), 118 సెక్షన్ల కింద నేరాలను అల్లు అర్జున్‌కు ఆపాదించాలా? అని హైకోర్టు స్పందించింది. రేవతి కుటుంబంపై సానుభూతి ఉందని తెలిపింది. అంత మాత్రాన నేరాన్ని ఒక్కరిపైనే రుద్దలేం అని పేర్కొంది. అదే సమయంలో అర్ణబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వ కేసులో సుప్రీ తీర్పును న్యాయమూర్తి ప్రస్తావించారు. 

రెగ్యులర్ బెయిల్ కోసం అలా చేయాల్సిందే?

రూ.50 వేల పూచీకత్తును సమర్పించాలని కోర్టు ఆదేశించింది. జైలు సూపరింటెండెంట్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు తెలపాలని అల్లు అర్జున్ లాయర్ పేర్కొన్నారు. దీంతో ఆదేశాలు పంపిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు విచారణకు సహకరించాలని అల్లు అర్జున్‌కు హైకోర్టు సూచించింది. విచారణలో జోక్యం చేసుకోవద్దని, సాక్ష్యులను ప్రభావితం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు