Rajasthan: నిన్నటికి నిన్న యావత్ దేశాన్ని ఆలోచింపజేసేలా చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య ఘటన మరిచిపోకముందే అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ డాక్టర్ కూడా అలాగే తన భార్యపెట్టే హింసలు,చిత్ర హింసలు భరించలేక సూసైడ్ లేఖ రాసి.. ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. Also Read: Ap: ఏపీ పై అల్పపీడన ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జాగ్రత్త! రాజస్థాన్ జోధ్‌పూర్ నగరంలో 35 ఏళ్ల హోమియోపతి డాక్టర్ అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు మరోసారి పెను సంచలనంగా మారింది. ఆత్మహత్యకు ముందు.. తన భార్య సుమన్‌పై ఆరోపణలు చేస్తూ రాసిన సుసైడ్ నోట్ లభించడం ఇప్పుడు బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసును గుర్తుకు తెస్తుంది. భార్యతోపాటు తనకు ఇంటి వివాదాలు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు అజయ్ ఆ లేఖలో చెప్పుకొచ్చాడు. Also Read: Joe Biden: ఒక్కరోజే 1500 మందికి శిక్ష తగ్గింపు.. చరిత్ర సృష్టించిన బైడెన్ జోధ్‌పూర్‌లోని కీర్తి నగరంలో ఉన్న తన క్లినిక్‌లోనే డాక్టర్ అజయ్ ఉరి వేసుకుని కనిపించాడు.అయితే అజయ్ కు ఎన్ని కాల్స్ చేసినా.. స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు.. క్లినిక్‌కు వెళ్లి చూడగా.. ఉరేసుకొని కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన భార్య సుమన్.. తనను మానసికంగా తీవ్రంగా హింసించినట్లు పేర్కొన్నారు. Also Read: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం తన పోరాటాన్ని, నిరాశను ఆ సూసైడ్ లేఖలో వ్యక్తం చేశాడు.అజయ్, సుమన్‌లకు 7 ఏళ్ల క్రితం పెళ్లి కాగా.. వారికి 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆ బాలుడు సుమన్‌తో కలిసి జైపూర్‌లో నివసిస్తున్నాడు. అజయ్ ను సుమన్ చాలా కాలం నుంచి మానసికంగా వేధింస్తోందని.. మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వేధింపులే అజయ్ కుమార్ జీవితంలో తీవ్రంగా కుంగిపోయేలా చేసి.. ఒత్తిడికి గురి చేశాయని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. డాక్టర్ అజయ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. Also Read: UP Crime: ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. భార్య దారుణ హత్య మూడు రోజుల క్రితం బెంగళూరుకు చెందిన టెకీ అతుల్ సుభాష్ .. 40 పేజీల సూసైడ్ లేఖ, ఓ సెల్ఫీ వీడియో తీసుకుని.. ఆ తర్వాత ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన గత 2, 3 రోజుల నుంచి దేశం మొత్తాన్ని ఆలోచింపజేస్తోంది. సెక్షన్ 498ఏ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని.. ఏకంగా లాయర్లే ఆందోళన వ్యక్తం చేస్తుండటం తీవ్ర చర్చకు తెర తీస్తోంది.