Mohan Babu: అయామ్‌ సారీ..మీడియాకి మోహన్ బాబు క్షమాపణలు!

కొద్ది రోజులుగా మంచు వారి కుటుంబంలో వివాదాలు నడుస్తున్నాయి.ఈ క్రమంలోనే మోహన్‌ బాబు ఆవేశంతో టీవీ 9 జర్నలిస్ట్‌ మీద దాడి చేశారు.తాజాగా ఆయన ఈ దాడి గురించి స్పందించారు. టీవీ9కి, జర్నలిస్ట్‌లకు క్షమాపణలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు.

New Update

Mohan Babu: గతకొద్ది రోజులుగా మంచు వారి కుటుంబంలో వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే.ఈక్రమంలోనే మంచు మోహన్‌ బాబు, ఆయన చిన్న కుమారుడు మనోజ్‌ కుమార్‌ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. కేసులు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే మోహన్‌ బాబు ఆవేశంతో టీవీ 9 జర్నలిస్ట్‌ మీద మైక్‌ తో దాడి చేశారు.

Also Read: Hyderabad: న్యూ ఇయర్‌ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే!

 ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ పూర్తిగా కోలుకోవడంకు చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని టీవీ 9 యజామాన్యం తెలిపింది. మోహన్‌ బాబు దాడి నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. మోహన్‌ బాబు క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు.

AlsoRead: Joe Biden: ఒక్కరోజే 1500 మందికి శిక్ష తగ్గింపు.. చరిత్ర సృష్టించిన బైడెన్

జర్నలిస్ట్‌పై దాడి చేసిన వెంటనే అనారోగ్యంతో మోహన్‌ బాబు ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యారు, రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్‌ అయ్యారు. మోహన్‌ బాబు జర్నలిస్టు పై జరిగిన దాడి గురించి స్పందించారు. 

టీవీ9 మేనేజ్‌మెంట్‌కి, జర్నలిస్ట్‌లకు క్షమాపణలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు. అందులో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు....''ఆ క్షణంలో గేటు విరగొట్టి 30 మంది లోనికి తోసుకు వస్తుంటే సంఘ వ్యతిరేక శక్తులు వస్తున్నారేమో అని నేను ఆందోళనతో ఆ పని చేశాను.

Also Read:Ap: ఏపీ పై అల్పపీడన ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జాగ్రత్త!

మీడియా మిత్రుడిపై అనుకోకుండా దాడి చేయడం జరిగింది. తన వల్ల జరిగిన ఇబ్బందికి క్షమాపణలు చెబుతున్నాను. టీవీ9 టీంకి, జర్నలిస్ట్‌ మిత్రుడు రంజిత్‌ కుటుంబానికి హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను. 

మీకు, మీ కుటుంబానికి కలిగిన మనోవేదనకు చింతిస్తున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు. మోహన్‌ బాబు దాడి నేపథ్యంలో ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. ఆయన క్షమాపణలు చెప్పడంతో గొడవ సర్దుమనిగినట్లు అయ్యింది. అయితే రంజిత్ ఆసుపత్రి ఖర్చుల విషయంలో మంచు ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో అనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు.

Also Read: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు