Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్‌కి ముందు టైం టు టైం జరిగింది ఇదే!

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే పోలీసులు బన్నీని అదుపులోకి తీసుకున్న టైం నుంచి నాంపల్లి కోర్టులో హాజరుపరచిన వరకు టైం టు టైం అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి.

New Update
allu arjun 1,

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో బిగ్ షాక్ తగిలిన విషయం తెలిసిందే. సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మరోవైపు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ అందించింది. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.  

Also Read: హైదరాబాద్ మోస్ట్ వాంటెడ్ గంజాయి లేడీ డాన్ అరెస్టు

అల్లు అర్జున్ కేసులో టైం టు టైం అప్డేట్స్ ఇవే

డిసెంబర్ 4 రాత్రి - సంధ్య థియేటర్‌లో తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. 
డిసెంబర్ 13న అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టుకు తరలించారు. 
11:45AM - అల్లు అర్జున్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు బన్నీ ఇంటికి వెళ్లారు.
12:00PM - అరెస్టు చేస్తున్నామని అల్లు అర్జున్‌కు పోలీసులు తెలిపారు.
12:00PM - అయితే బెడ్రూంలోకి వెల్లిన పోలీసులపై బన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Also Read: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు

12:15PM- అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు. 
12:20PM- జూబ్లిహిల్స్ నివాసం నుంచి అల్లు అర్జున్‌ను తరలించారు.
1:00PM - చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్‌ను తరలించారు. 
1:15PM- అరెస్టుపై పోలీసులు రిమాండ్ రిపోర్టు రెడీ చేశారు.
1:30PM - చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బన్నీ అభిమానులు భారీగా చేరుకున్నారు.
1:45PM- అరంతరం హైకోర్టులో లంచ్ మోషన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
2.00PM- ఆపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు డైరెక్టర్లు, నిర్మాతలు చేరుకున్నారు.
2:05PM గంటలకు పోలీసు వాహనాలు సిద్ధం చేశారు.
2:10 PM గంటలకు అల్లు అర్జున్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

Also Read: బోడుప్పల్లో భారీ గంజాయి చాక్లెట్ల పట్టివేత.. బీహార్‌ నుంచి తెప్పించి..

2:35PM గంటలకు గాంధీ అసుపత్రిలో బన్నీకి వైద్యపరీక్షలు నిర్వహించారు.
3:15PM గంటలకు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ తరలించారు.
3.20PM గంటలకు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌ను పోలీసులు హాజరుపరిచారు. 
3:30PM గంటలకు అల్లు అర్జున్ పిటిషన్‌పై కోర్టులో విచారణ మొదలైంది.
4:00PM గంటలకు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.

ఇంతకీ ఏం జరిగింది?

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. అంతకు ముందురోజు ప్రదర్శించిన ప్రీమియర్‌ షోలో సమయంలో ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఈ సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్‌లోని RTC క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్‌లో బుధవారం రాత్రి ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడంతో ఫ్యాన్స్ భారీగా వచ్చారు.

Also Read: Ap: ఏపీ పై అల్పపీడన ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జాగ్రత్త!

దీంతో థియేటర్ ముందు తొక్కిలసట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ కిందపడిపోయారు. పోలీసులు వారిని గమనించి సీపీఆర్ చేసిన ఫలితం దక్కలేదు. రేవతి ఆ తొక్కిసలాటలో కన్నుమూసింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

అల్లు అర్జున్‌పై కేసు నమోదు

సంధ్య థియేటర్‌ వద్ద చోటుచేసుకున్న ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసినట్లు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ టీమ్‌పై బీఎన్ఎస్‌లోని సెక్షన్ 105,118(1) r/w 3(5) కింద కేసు నమోదైనట్టుగా వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు