స్కూల్‌కు వెళ్లేందుకు ఆలస్యం అవుతుందని తల్లి కొడుకుని నిద్ర లేపితే దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్‌లో ఓ తల్లి తన కొడుకును నిద్ర లేపింది. స్కూల్‌కు వెళ్లేందుకు ఆలస్యం అవుతుందని లేపగా.. ఆ కొడుకు కోపంతో తల్లి తలను బలంగా నేలకోసి కొట్టాడు. దీంతో తలకు గాయం అయ్యి ఆ తల్లి మరణించింది.
ఇది కూడా చూడండి: Japan: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
కాల్ లిఫ్ట్ చేయకపోయే సరికి..
ఆమె భర్త చెన్నైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో సైంటిస్ట్‌గా చేస్తున్నారు. అతను ఎన్నిసార్లు కాల్ చేసిన కూడా రెస్పాండ్ లేదు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్లే కొడుకు తల్లిని చంపినట్లు తండ్రి తెలిపారు. తల్లిని చంపిన తర్వాత ఇంటికి తాళం వేసి నాలుగు రోజుల పాటు శవంతోనే ఉన్నాడు.
ఇది కూడా చూడండి: Hyderabad: న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే!
శరీరం నుంచి కుళ్లిపోయిన వాసన వస్తున్నా కూడా అగర్‌బత్తీలు ముట్టించేవాడు. కుటుంబ పరిస్థితిని చూడాలని తండ్రి ఇంటికి రావడంతో తాళం వేసి ఉంది. కానీ లోపల నుంచి ఎక్కువగా దుర్వాసన రావడంతో లోపలకి వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో తన భార్య చనిపోయి ఉంది. ఆ కొడుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: TN: తమిళనాడు ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం– ఆరుగురు మృతి
చెడు వ్యసనాలు డ్రగ్స్, మద్యానికి గురై ఇలా చేశాడని పోలీసుల విచారణలో తేలింది. చదువు పేరుతో తల్లి దగ్గర డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేసేవాడు. ఇలా డబ్బులు విషయంలో గతంలో ఎన్నోసార్లు వాగ్వాదం జరిగింది. ఇవన్నీ కోపంతో చివరకు తల్లినే హతమార్చాడు. తానే తల్లిని హత్య చేసినట్లు ఆ కొడుకు ఒప్పుకున్నాడు.
ఇది కూడా చూడండి: Allu Arjun: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్