ఎట్టకేలకు పోలీసులు హైదరాబాద్ మోస్ట్ వాంటెడ్ గంజాయి లేడీ డాన్‌ను అరెస్టు చేశారు. ఏకంగా పదికి పైగా కేసులు ఉన్న అంగూర్ బాయ్‌ను పోలీసులు అరెస్ట చేశారు. దూల్‌పేట్‌కే గంజాయి డాన్‌గా పేరు తెచ్చుకున్న ఈమె పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతుంది. గంజాయి అమ్మకాల్లో అంగూర్ బాయ్ టాప్. నగరంలోని పలు ప్రాంతాల్లో రూ.కోట్లలో గంజాయి బిజినెస్ చేస్తుంటుంది. ఇది కూడా చూడండి: Japan: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం జైలుకు వెళ్లి వచ్చిన కూడా భయం లేకుండా.. అంగూర్ బాయ్ పైన పలు స్టేషన్‌లో పెద్ద మొత్తంలోనే కేసులు నమోదై ఉన్నాయి. ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో మూడు, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో 4, ఆసిఫ్ నగర్, గౌరారం స్టేషన్‌లో పది కేసులు ఉన్నాయి. అంగూర్ బాయ్ మీద ఇన్ని కేసులు ఉన్నా కూడా ఈమె పోలీసుల చేతికి చిక్కకుండా తిరుగుతోంది. 13 కేసుల్లో నిందితురాలుగా ఉండటంతో ఇప్పటికే జైలుకు వెళ్లి కూడా వచ్చింది. అయిన కూడా భయం లేకుండా ఇంకా అంగూర్ బాయ్ గంజాయి వ్యాపారం, రిటైల్ అమ్మకాలు చేస్తోంది. ఇది కూడా చూడండి: Hyderabad: న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే! కేవలం అంగూర్ బాయ్ మాత్రమే కాకుండా ఆమె కుటుంబ సభ్యులు కూడా ఇదే గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమె కుటుంబంలో ఉన్న సభ్యుల్లో పది నుంచి పదిహేను మంది ఉంటారు. వీరిపై కూడా దాదాపుగా పది కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఎన్నో కేసులో నేరస్తురాలిగా ఉన్నా.. పోలీసుల చేతికి ఇన్ని రోజులు చిక్కలేదు. చివరికి ధూల్‌పేట్‌లో ఎస్‌టీఎఫ్, ఎక్సైడ్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఇది కూడా చూడండి: TN: తమిళనాడు ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం– ఆరుగురు మృతి ఇది కూడా చూడండి: Allu Arjun: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్