వైసీపీ నేత దేవినేని అవినాష్ అరెస్ట్

రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరిన వైసీపీ నేత దేవినేని అవినాష్‌ను పోలీసులు నడిరోడ్డుపై అరెస్టు చేశారు. పోలీసుల అక్రమ అరెస్ట్‌పై అవినాష్ మండిపడ్డారు. రైతులకు అండగా ఉండటం కూడా తప్పేనా? అని పోలీసులను నిలదీశారు.

New Update
Devineni avinash arrestr

వైసీపీ నేత దేవినేని అవినాష్‌ను పోలీసులు నడిరోడ్డుపై అరెస్టు చేశారు. రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు అవినాష్ బయలు దేరారు. ఈ క్రమంలో అతన్ని వైఎస్సార్ కడప జిల్లాలోని వేములలో పోలీసులు అరెస్టు చేశారు. అవినాష్‌తో పాటు మరికొందరు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అవినాష్‌ను అరెస్ట్ చేయడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఇది కూడా చూడండి: Japan: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఇది కూడా చూడండి: Hyderabad: న్యూ ఇయర్‌ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే!

నడిరోడ్డుపై అరెస్టు చేయడంతో..

పోలీసులు ఇలా నడిరోడ్డుపై అరెస్టు చేయడంతో వారి తీరును అవినాష్ తప్పుబట్టాడు. రైతులకు అండగా నిలవడం తప్పా అంటూ అవినాష్ పోలీసులను నిలదీశాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా పోలీసులు చెప్పడం లేదని అవినాష్ మండిపడ్డారు. అయితే సాగునీటి సంఘాల ఎన్నికలపై మాట్లాడేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లేందుకు అవినాశ్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్యాలయానికి వెళ్తే గొడవలు జరుగుతాయన్న ఉద్దేశంతో పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: TN: తమిళనాడు ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం– ఆరుగురు మృతి

ఇది కూడా చూడండి: Allu Arjun: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు