భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుందని విన్నాం. కట్నం తీసుకురాలేదని కొట్టడం, తిట్టడం వంటి వార్తలు చాలానే చూశాం. కానీ ఇటీవల భార్య బాధితులు పెరిగిపోతుండటం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇటీవల బెంగళూరుకి చెందిన ఓ టెకీ ఉద్యోగి భార్య వేధింపులు తాళ్లలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన యావత్తు దేశాన్ని కుదిపేసింది. ప్రభుత్వం, చట్టాలు అన్ని మహిళలకే అనుకూలంగా ఉండటంతో భర్తలు ఆత్మహత్య చేసుకుంటున్న దారుణాలు పెరిగిపోతున్నాయని భార్య బాధితులు ఆరోపిస్తున్నారు. తప్పు భార్య లేదా భర్తది అయిన న్యాయ వ్యవస్థ మాత్రం.. కేవలం భార్యలకు సపోర్ట్‌గా తీర్పునిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్యపై లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే విచారణ చేయకుండానే ముందు భర్తలను అరెస్టు చేస్తున్నారు. కేవలం భార్యల వేదనలను మాత్రమే కోర్టులు వింటాయా? భర్తలు పడుతున్న ఆవేదనలను కోర్టులు వినవా? మహిళలకే ఎందుకు ప్రత్యేక చట్టాలు? పురుషుల గోడు వినేదెవరు? అనే విషయాలు తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి. ఇది కూడా చూడండి: Japan: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం 24 పేజీల లేఖ రాసి.. బెంగళూరుకి చెందిన అతుల్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తన భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని 24 పేజీల లేఖను రాసి అతుల్ చనిపోయాడు. తప్పుడు కేసులతో భార్యలు వేధిస్తే.. భర్తలకు చనిపోవడం తప్ప మరొక దారి లేదని వాపోయాడు. భర్త ఉద్యోగం చేయకపోయిన జాబ్ చేస్తున్న భార్యకు భరణం ఇవ్వాలి. కేవలం భర్తలు మాత్రమే భరణం ఇవ్వాలా? భార్యలు భరణం ఇవ్వకూడదా? అని లేఖలో అతుల్ తెలిపాడు. మొదట కోటి రూపాయిలు ఇవ్వాలని అతుల్ భార్య డిమాండ్ చేసిందని ఆ తర్వాత రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందని అతుల్ లేఖలో వెల్లడించాడు. చివరకు తన కొడుకును చూడటానికి కూడా రూ.30 లక్షలు డిమాండ్ చేసిందని అతుల్ ఆందోళన చెందాడు. కొందరు మహిళలు ఇలానే మగాళ్లను వేధించి వారి కన్నీటి చుక్కలతో డబ్బు పోగేసుకుంటున్నారని అతుల్ బాధపడ్డాడు. తన చావుకి కారణం అయిన వారికి ఎలాగైన శిక్ష పడాలని, అప్పుడే తన అస్థికలను కలపాలని లేఖలో తెలిపాడు. దీంతో దేశ వ్యాప్తంగా టెకీ పురుష ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. జెండర్ ఈక్వాలిటీ లేకపోయిన కనీసం భార్య బాధితుల కోసమైన రక్షణ చట్టాలు ఉండాలని ఆరోపిస్తున్నారు. ఇది కూడా చూడండి: Hyderabad: న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే! ఇలాంటి ఘటనలు మరెన్నో.. భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. కానీ వెలుగులోకి రావడం లేదు. ఇటీవల అనంతపురం జిల్లాలో భార్య పెట్టే వేధింపులు తాళ్లలేక సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మా నాన్న నన్ను క్షమించండి.. భార్య ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోంది.. నేను ఈ బాధ పడలేనని భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మరోవైపు అల్లూరి సీతారామ రాజు జిల్లాలో కూడా ఓ వ్యక్తి తన భార్య తిట్టే తిట్లు భరించలేక ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇవే కాకుండా నాగర్ కర్నూల్‌లో కూడా ఓ భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు ఉన్నాయి. భర్త బాధితులకు జరుగుతున్న న్యాయం భార్య బాధితులకు జరగడం లేదని పురుషులు వాపోతున్నారు. ఇది కూడా చూడండి: TN: తమిళనాడు ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం– ఆరుగురు మృతి ఇది కూడా చూడండి: Allu Arjun: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్