బోడుప్పల్లో భారీ గంజాయి చాక్లెట్ల పట్టివేత.. బీహార్‌ నుంచి తెప్పించి..

హైదరాబాద్‌లోని బోడుప్పల్లో ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఓ బడ్డీ కొట్టులో ఒక్కో గంజాయి చాక్లెట్లు రూ.15 చొప్పున విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. నిందితులు బీహార్‌కి చెందిన వీరేంధ్రబూ నుంచి గంజాయి చాక్లెట్లు స్వాధీనం.

New Update
Ganja Chocolates: హైదరాబాద్ కు కూతవేటు దూరంలో.. కిరాణ షాపుల్లో గంజాయి చాక్లెట్లు.. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులే టార్గెట్!

TG News: హైదరాబాద్‌లోని బోడుప్పల్లో ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ బడ్డీ కొట్టులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.  గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారన్న  పక్క మేరకు సమాచారంలో  గౌతంనగర్ లోని స్లమ్ ఏరియాలో ఎన్టీఎఫ్ టీమ్ దాడులు నిర్వహించారు.   బీహార్ నుంచి  గంజాయి చాక్లెట్లను తీసుకువచ్చి హైదరాబాద్‌లోని పలు స్లమ్ ఏరియాల్లో చాక్లెట్లను అమ్ముతూన్నాడు. 

ఇది కూడా చూడండి:  హైదరాబాద్ మోస్ట్ వాంటెడ్ గంజాయి లేడీ డాన్ అరెస్టు

గంజాయి చాక్లెట్లను స్వాధీనం:

ఒక్కో గంజాయి చాక్లెట్లను రూ.15 చొప్పున విక్రయిస్తున్నట్లు  అధికారుల తనిఖీల్లో తేల్చారు.  గంజాయి చాక్లెట్ల విక్రయాలలో ప్రజలు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని గురువారం ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుడి దగ్గర నుంచి 4.957కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. 

ఇది కూడా చూడండి: న్యూ ఇయర్‌ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే!

ఎక్సైజ్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కి చెందిన వీరేంధ్రబూ పండరీ బతుకు దెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. బోడుప్పల్లో పనిచేస్తూనే హైదరాబాద్‌లో గంజాయికి ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు గ్రహించారు. బీహార్ నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకుని వచ్చి ఇక్కడ కూలీలకు నిందితుడు విక్రయిస్తున్నాడు. గౌతంనగర్ ప్రాంతంలోఉన్న స్లమ్ ఏరియాలో గంజాయి అమ్మకాలు జరుపుతున్న నిందితుడిని అరెస్టు చేశారు. ఎస్సైలు అఖిల్ ఆధ్వర్యంలో.. వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు సుధాకర్, రవి, కిషన్‌రావు, సుధీష్, శ్రీనివాస్ తనిఖీల్లో పాల్గొన్నారు. కేసు దర్యాప్తు కోసం ఘట్‌కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: శీతాకాలంలో అరటిపండు తినడం మంచిదేనా?

ఇది కూడా చూడండి: తమిళనాడు ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం– ఆరుగురు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు