🔴RTV NEWS APP: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

Also Read :  అనంతపురంలో ఇంటర్ విద్యార్థినీ దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు

RTV NEWS APP: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్‌ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV Live Telugu న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్‌ చేసుకోండి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.

RTV LIVE Telugu News App

RTV న్యూస్ యాప్(RTV NEWS APP) ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్‌ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్‌ చేసుకోండి. ఈ కింది లింక్స్ పై క్లిక్ చేసి నేరుగా మీ యాప్ ను అప్డేట్ చేసుకోవచ్చు. 

RTV News App Download Links:

ఆండ్రాయిడ్ వినియోగదారులు(Android) - https://t.co/B1FaPB6Zsr
IOS వినియోగదారులు - https://t.co/4nRQaLbtfv

  • Jun 09, 2025 21:09 IST

    భారతీయ విద్యార్థిపై అమెరికా అధికారుల కర్కశం.. వీడియో వైరల్

    అమెరికాలో బహిష్కరణకు గురైన వారిపట్ల అక్కడి అధికారులు ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఓ భారతీయ విద్యార్థిని బహిష్కరించే సమయంలో అతడిని అమెరికా అధికారులు వ్యవహరించిన తీరు కలకలం రేపుతోంది.

    Indian Man Handcuffed, Pinned To Floor At US Airport
    Indian Man Handcuffed, Pinned To Floor At US Airport

     



  • Jun 09, 2025 20:27 IST

    తొక్కిసలాట ఘటన.. కర్ణాటక సర్కార్‌ కీలక నిర్ణయం

    తొక్కిసలాట ఘటనతో రాష్ట్రం ఎన్నో పాఠాలు నేర్చుకుందని పేర్కొందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. బహిరంగ కార్యక్రమాల నిర్వహణ విషయంలో ఓ చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నామన్నామని పేర్కొన్నారు.

    DK Shiva Kumar
    DK Shiva Kumar

     



  • Jun 09, 2025 20:25 IST

    బీజేపీతో మాకు సంబంధం శాశ్వతంగా ఉంటుంది.. చంద్రబాబు సంచలన ప్రకటన

    బీజేపీతో తమ సంబంధాలు శాశ్వతంగా కొనసాగుతాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాలు పంచుకున్నారు.

    Ties With with bjp Continue forever, Says CM Chanra babu naidu
    Ties With with bjp Continue forever, Says CM Chanra babu naidu

     



  • Jun 09, 2025 18:31 IST

    రిలేషన్ షిప్‌ వద్దన్నందుకు OYO రూమ్లో పొడిచి చంపేశాడు..

    ఈమధ్య కాలంలో ప్రేమికులు కూడా ఒకరినొకరు చంపుకునే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా బెంగళూరులోని ఓయో హోటల్‌లో రూమ్‌లో ఓ యువతి బాయ్‌ఫ్రెండ్ చేతిలో హత్యకు గురైంది.

    Techie Kills Married Mother Of 2 He Was Dating in Bengaluru
    Techie Kills Married Mother Of 2 He Was Dating in Bengaluru

     



  • Jun 09, 2025 16:51 IST

    కేరళ కోజికోడ్‌ తీరంలో భారీ ప్రమాదం.. నలుగురు సిబ్బంది గల్లంతు

    కేరళ కోజికోడ్‌ తీరంలో మరో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సింగపూర్‌కు చెందిన కంటైనర్‌ షిప్‌లో భారీ పేలుడు సంభవించింది. కేరళ తీరం నుంచి 130 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.

    Singaporean cargo ship catches fire after explosion off Kerala coast
    Singaporean cargo ship catches fire after explosion off Kerala coast

     



  • Jun 09, 2025 15:25 IST

    TGSRTC: ప్రయాణికులకు షాకిచ్చిన తెలంగాణ ఆర్టీసీ.. ఛార్జీలు పెంపు..

    తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నేటి నుంచి అమలులోకి వచ్చింది. ఇది సుమారుగా 22 శాతం పెరుగుదల కావడం గమనార్హం.

    TGSRTC: ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు.. టీజీఎస్‌ఆర్టీసీ క్లారిటీ
    TGSRTC

     



  • Jun 09, 2025 14:55 IST

    ఎలాన్‌ మస్క్‌పై ట్రంపే గెలుస్తారు: ఎర్రోల్‌ మస్క్‌

    ట్రంప్, ఎలాన్ మస్క్‌ మధ్య నెలకొన్న వివాదంపై మస్క్ తండ్రి ఎర్రోల్‌ మస్క్‌ స్పందించారు. రిపబ్లికన్ ట్యాక్స్‌ బిల్లు వల్లే వీళ్లిద్దరి మధ్య వివాదం జరిగిందని తెలిపారు. ఈ వివాదంలో ట్రంప్ గెలుస్తారని చెప్పారు. ఇప్పటికైనా ఇద్దరూ కలిసి పనిచేయాలని సూచించారు.

    Errol Musk Blames Elon's Trump Clash On PTSD, Predicts President's Win In Heated Spat
    Errol Musk Blames Elon's Trump Clash On PTSD, Predicts President's Win In Heated Spat

     



  • Jun 09, 2025 13:29 IST

    Kaleshwaram Commission: 20 ప్రశ్నలు.. ఆధారాలతో సహా అన్నీ బయటపెట్టానన్న హరీశ్ రావు!

    మాజీ మంత్రి హరీశ్ రావు సోమవారం కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైయ్యారు. బీఆర్కే భవన్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ఆయన్ని 45 నిమిషాల పాటు ప్రశ్నించింది.

    Harish Rao



  • Jun 09, 2025 13:24 IST

    Los Angeles protest: ట్రంప్ అధ్యక్ష కుర్చీకి లాస్ ఏంజిల్స్‌ నిరసన జ్వాలలు

    రికార్డు స్థాయిలో అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని, అమెరికా-మెక్సికో సరిహద్దును మూసివేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ ఈ నిరసనలను చట్టం, దేశ సార్వభౌమాధికారంపై తిరుగుబాటుగా అభివర్ణించారు.

    Los Angeles



  • Jun 09, 2025 13:23 IST

    Los Angeles Protests: భగ్గుమంటున్న లాస్ ఏంజిల్స్‌.. కాలిబూడిదవుతున్న వందల కార్లు

    అమెరికా లాస్‌ఏంజిలెస్‌లో సోమవారం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్రమవలసదారుల ఏరివేతకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు ప్రజలు. రోడ్లపైకి వచ్చి వందల కార్లకు నిప్పంటించారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిని చెదరగొట్టేందుకు టియర్‌గ్యాస్ ప్రయోగించారు.

    Los Angeles



  • Jun 09, 2025 13:23 IST

    Mudragada Padmanabha: ‘నా ఆరోగ్య పరిస్థితి ఇదే’.. ముద్రగడ సంచలన లేఖ

    మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రెడ్డి తాజాగా సంచలన లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో ఆయన తన ప్రస్తుత ఆరోగ్యం, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన పలు అంశాలను రాసుకొచ్చారు. నిత్యం తన ఇంటికి వచ్చిన అభిమాన ప్రజలందరితోనూ కలుస్తున్నానన్నారు.

    Mudragada Padmanabham reddy Releases Letter
    Mudragada Padmanabham reddy Releases Letter Photograph: (Mudragada Padmanabham reddy Releases Letter)

     



  • Jun 09, 2025 13:22 IST

    Gold Rates Today: బంగారం ధర తగ్గిందోచ్.. వెంటనే కొనేయండి

    బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. HYDలో 24 క్యారెట్ల 10గ్రా బంగారం రూ.280 తగ్గింది. దీంతో ఇది రూ.97,690కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా బంగారం రూ.250 తగ్గి.. రూ.89,550కి చేరింది. కేజీ వెండి ధర రూ.1000 తగ్గి.. రూ.1,17,000గా నమోదైంది.

    gold rates today monday
    gold rates today monday

     



  • Jun 09, 2025 13:22 IST

    Mumbai Local Train Accident: లోకల్ ట్రైన్ నుంచి జారి పడి ఐదుగురు స్పాట్ డెడ్ - షాకింగ్ వీడియో

    మహారాష్ట్రలోని ముంబైలో భారీ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లోకల్ ట్రైన్ నుంచి పట్టాలపై జారిపడి ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురి ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ట్రైన్‌లో అధిక రద్దీ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 

    Five people died after falling from Maharashtra, Mumbra local train
    Five people died after falling from Maharashtra, Mumbra local train

     



  • Jun 09, 2025 11:23 IST

    BIG BREAKING: జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్

    జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు హైదరాబాద్‌లో అరెస్ట్ అయ్యారు. జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంట్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పీఎస్‌లో కేసు నమోదైంది. 

    Kommineni Srinivasa Rao



  • Jun 09, 2025 10:15 IST

    BIG BREAKING: పోలీసుల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు

    చత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో పోలీసుల వాహనాన్న మావోయిస్టులు పేల్చేశారు. పేలుడుతో ASP ఆకాశ్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి.  

    BREAKING NEWS
    BREAKING NEWS

     



  • Jun 09, 2025 09:50 IST

    Honeymoon Couple Missing: భార్య మాస్టర్ ప్లాన్.. భర్తను హనీమూన్‌కు తీసుకెళ్లి లేపేసింది..!

    మేఘాలయ హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త రాజారఘువంశీని భార్య సోనమ్ చంపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల రాజా-సోనమ్ దంపతులు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. అక్కడ రాజు హత్యకు గురికాగా సోనమ్ కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.

    Honeymoon Couple Missing case wife sonam arrested
    Honeymoon Couple Missing case wife sonam arrested

     



  • Jun 09, 2025 08:34 IST

    AP Earthquake: ఏపీలో భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

    ఏపీలోని ప్రకాశం జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ముండ్లమూరు ప్రాంతాల్లో అర్ధరాత్రి స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రాత్రి 12.47 గంటలకు నాలుగు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

    Earth Quake : లేహ్ లడఖ్ లో భూకంపం..కదిలిన కొండలు



  • Jun 09, 2025 08:14 IST

    Samsung Galaxy A55 5G: సవకే సవక.. రూ.14వేల భారీ డిస్కౌంట్ - 8GB ర్యామ్, 50MP కెమెరా ఫోన్‌ తక్కువకే!

    అమెజాన్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ ఏ55 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. దీని అసలు ధర రూ.39,999 కాగా ఇప్పుడు రూ.25,999లకే కొనుక్కోవచ్చు. అంటే రూ.14 వేల డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ కూడా అందుబాటులో ఉంది.

    samsung galaxy a55 5g smartphone
    samsung galaxy a55 5g smartphone

     



  • Jun 09, 2025 08:11 IST

    FLASH NEWS: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కొత్త మంత్రులకు శాఖల అప్పుడే..!

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం 10గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత కొత్త మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకుల గురించి పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు.

    CM Revanth Reddy to go to Delhi



  • Jun 09, 2025 07:45 IST

    Telangana Crime: తెలంగాణలో దారుణం.. భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

    సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావడంలేదని భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. కిరణ్‌కు 5ఏళ్ల క్రితం లవ్‌మ్యారేజ్ అయింది. ఈమధ్య ఇద్దరికీ మనస్పర్థాలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో సూసైడ్ చేసుకున్నాడు.

    Telangana Siddipet man suicide
    Telangana Siddipet man suicide

     



  • Jun 09, 2025 07:11 IST

    Telangana: అయ్యో బిడ్డా.. తెలంగాణ యువకుడి ప్రాణం తీసిన ట్రిమ్మర్

    తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ట్రిమ్మర్‌కు ఛార్జింగ్‌ పెడుతుండగా కరెంట్ షాక్‌కు గురై బొమ్మగాని తిరుపతి (32) మృతి చెందాడు. ఎండపల్లి మండలం ముంజంపల్లిలో జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

    Telangana Jagtial young man died after trimmer shock (1)
    Telangana Jagtial young man died after trimmer shock (1)

     



  • Jun 09, 2025 07:11 IST

    Viral Video: 70ఏళ్లు సహజీవనం.. 90ఏళ్లకు పెళ్లి చేసుకున్న వృద్ధ జంట

    రాజస్థాన్‌లో 90ఏళ్ల వయసులో ఓ వృద్ధ జంట పెళ్లి చేసుకుంది. 70ఏళ్లు కలిసి వారు సహజీవనం చేసి, 8 మంది పిల్లలు అయ్యాక వారు వివాహ వేడుక చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    Old couple gets married



  • Jun 09, 2025 06:57 IST

    Earthquake: భారీ భూకంపం.. ధ్వంసమైన బిల్డింగ్‌లు, బద్ధలైన రోడ్లు - వణికించే వీడియోలు

    కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. 6.5 తీవ్రతతో భూమి కంపించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. దీని కారణంగా భవనాలు నేలకూలాయి. ప్రజలు తమ ఇళ్లల్లోంచి వణుకుతూ బయటకు పరుగులు తీశారు. రోడ్లలో పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి.

    Earthquake
    Earthquake

     



  • Jun 09, 2025 06:35 IST

    Phone Tapping Case: బిగ్ ట్విస్ట్.. హైదరాబాద్‌కు చేరుకున్న ప్రభాకర్ రావు

    ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న SIB మాజీ డీజీపీ ప్రభాకర్ రావు ఇండియాకు చేరుకున్నారు. LOC, రెడ్ కార్నర్ నోటీసులు మంజూరు చేసు ఆయన అమెరికా పాస్‌పోర్టును రద్దు చేయించారు పోలీసులు. దీంతో ప్రభాకర్ రావు ఆదివారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.

    phone tapping case 123



Advertisment
Advertisment
తాజా కథనాలు