Shambhala Teaser: ఉగంధర్ ముని దర్శకత్వంలో ఆది హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మిస్టర్ థ్రిల్లర్ 'శంభాలా'. అయితే తాజాగా ఈమూవీ టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఫుల్ సస్పెన్స్, మిస్టరీ ఎలిమెంట్స్ తో సాగిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ విశ్వంలో అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఉన్నాయి.. వాటిని సైన్స్ వివరించలేనప్పుడు మూఢనమ్మకాలు అంటారు.. అనే వాయిస్ ఓవర్ తో టీజర్ పవర్ ఫుల్ గా ప్రారంభమైంది.
Also Read: Akhil Akkineni Wedding: అఖిల్ సంగీత్ లో నాగచైతన్య, నాగార్జున రచ్చ రచ్చ! వీడియో వైరల్
టీజర్ లో ఏముంది?
ఆకాశం నుంచి ఓ వింత వస్తువు.. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో పడిపోవడంతో కథ మొదలవుతుంది. అప్పటి నుంచి ఆ గ్రామంలో భయంకరమైన, అంతుచిక్కని సంఘటనలు జరగడం టీజర్ లో సస్పెన్స్ క్రియేట్ చేసింది. దీంతో పాటు టీజర్ లోని క్యారెక్టర్స్, టీజర్ కట్ ఆసక్తికరమైన మూడ్ ను సృష్టించాయి.
ఆ వింత శక్తి నుంచి ప్రజలను కాపాడడానికి ఆది వస్తాడు. కానీ అప్పటికే ఆ చెడు శక్తి నియంత్రణలోకి వెళ్లిన గ్రామ ప్రజలు హీరో పైకి తిరగబడతారు. ఆది ఆ గ్రామాన్ని ఎలా కాపాడాడు? ఆ గ్రామాన్ని పీడిస్తున్న ఆ శక్తి ఏంటి? అనేది సినిమా కథగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఆది సాయికుమార్(aadi-saikumar) పాత్ర చాలా పవర్ ఫుల్ గా కనిపించింది. ఈ సినిమాతో మళ్ళీ కమ్ బ్యాక్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
#Shambhala Teaser https://t.co/wsSdaje8mX@tweets_archana @SwasikaVlog @ugandharmuni @ShiningPictures pic.twitter.com/0hlPNHxQZp
— Aadi Saikumar (@iamaadisaikumar) June 7, 2025
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నబిమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వాసిక, రవి వర్మ, మధునందన్, శివకార్తిక్, శైలజ ప్రియ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Also Read: Iswarya Menon: నడుము అందాలు చూపిస్తున్న ఐశ్వర్య.. హాట్ లుక్స్‌లో పిచ్చెక్కిస్తుందిగా!