Los Angeles protest: ట్రంప్ ప్రెసిడెంట్ కుర్చీకి లాస్ ఏంజిల్స్‌ నిరసన మంటలు

రికార్డు స్థాయిలో అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని, అమెరికా-మెక్సికో సరిహద్దును మూసివేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ ఈ నిరసనలను చట్టం, దేశ సార్వభౌమాధికారంపై తిరుగుబాటుగా అభివర్ణించారు.

New Update
trump at los angeles

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో అక్రమ వలసదారులపై అణిచివేతకు వ్యతిరేకంగా 3రోజులుగా జరుగుతున్న నిరసన హింసాత్మకంగా మారింది. నిరసనకారులు నగరంలోని అనేక రోడ్లకు నిప్పు పెట్టారు. చాలా మంది నిరసనకారులు మెక్సికో జెండాను పట్టుకుని బయటకు వచ్చారు. పరిస్థితిని నియంత్రించడానికి, యుఎస్ నేషనల్ గార్డ్ ఆదివారం రాత్రి నిరసనకారులపై టియర్ గ్యాస్ షెల్స్, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించింది. దీంతో నిరసనకారులు అమెరికా జెండాపై ఉమ్మివేయడం, తగలబెట్టడం చేశారు. ఈ సంఘటన మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ వెలుపల జరిగింది. నిరసనకారులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా అధికారం నుంచి దిగిపోవాలని నినాదాలు చేశారు.

ఈ నగరం అక్రమ వలసదారులచే ఆక్రమించబడిందని, త్వరలోనే దీనికి విముక్తి లభిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో రాశారు. లాస్ ఏంజిల్స్‌లో 2వేల మంది నేషనల్ గార్డ్ మోహరించారు. అయితే.. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, లాస్ ఏంజిల్స్ మేయర్ కరెన్ బాస్ నేషనల్ గార్డ్‌లను పంపడాన్ని వ్యతిరేకించారు. గవర్నర్ అనుమతి లేకుండా ఒక రాష్ట్ర నేషనల్ గార్డ్‌ను పంపడం ఇదే మొదటిసారి.

జూన్ 6, 7 తేదీలలో లాస్ ఏంజిల్స్‌లో అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. దీనినే వారు వ్యతిరేకిస్తున్నారు. ఆదివారం ఉదయం నిరసనకారులు పోలీసులపై రాళ్ళు, బాణసంచా విసిరారు. అంతకుముందు, భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం నిరసనలు జరిగాయి. ఈ సమయంలో, నిరసనకారులు పోలీసులపై రాళ్ళు మరియు బాణసంచా విసిరారు. దీనితో పాటు, భద్రతా దళాలు, ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) పై నిరసనకారులు కన్నీటి గ్యాస్, పెట్రోల్ బాంబులను విసిరారు.

అనేక ప్రభుత్వ భవనాలు, వాహనాలపై స్ప్రే పెయింట్లతో నినాదాలు రాశారు. ఒక స్ట్రిప్ మాల్‌కు నిప్పు పెట్టారు. అనేక దుకాణాలను ధ్వంసం చేశారు. నిరసనకారులు మెక్సికన్ జెండాలను కూడా మోసుకెళ్లి 'ICE గెట్ అవుట్ ఆఫ్ లాస్ ఏంజిల్స్' వంటి నినాదాలు చేశారు. దీంతో 100 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. 

3000 మంది వలసదారులను అరెస్టు చేయడమే లక్ష్యం

ట్రంప్ బహిష్కరణ విధానం ప్రకారం.. ICE రోజుకు 3వేల మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసి బహిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దాడులకు కారణం కొంతమంది వ్యాపారవేత్తలు ఫేక్ డ్యాకుమెంట్స్ ఉపయోగించారు. అధికారుల ప్రకారం.. ప్రతిరోజూ దాదాపు 1600 మంది అక్రమ వలసదారులను పట్టుకుంటున్నామని ICE అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి, వెయ్యి మంది నిరసనకారులు ప్రభుత్వ  కార్యాలయాన్ని చుట్టుముట్టి ICE అధికారులపై దాడి చేశారని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పేర్కొంది. ఈ నిరసనకారులలో ప్రధానంగా ఇమిగ్రెట్స్ మద్దతుదారులు, స్థానిక నివాసితులు, కోయలిషన్ ఫర్ హ్యూమన్ ఇమ్మిగ్రెంట్ రైట్స్, నేషనల్ డే లేబర్ ఆర్గనైజింగ్ నెట్‌వర్క్ వంటి సంస్థల సభ్యులు ఉన్నారు.

అమెరికా, మెక్సికో సరిహద్దును మూసివేస్తామన్న ట్రంప్

రికార్డు స్థాయిలో అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని, అమెరికా-మెక్సికో సరిహద్దును మూసివేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ ఈ నిరసనలను చట్టం, దేశ సార్వభౌమాధికారంపై తిరుగుబాటుగా అభివర్ణించారు.

Advertisment
తాజా కథనాలు