/rtv/media/media_files/2025/06/09/3Y53cmRd4QfLoTh0Ktjq.jpg)
samsung galaxy a55 5g smartphone
అతి తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా?. అద్భుతమైన కెమెరా, పెద్ద బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లు గల ఫోన్‌ను కేవలం రూ. 30,000 కంటే తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇక్కడ Samsung Galaxy A55 5G మంచి ఆప్షన్. ప్రస్తుతం Galaxy A55 5G ఈ-కామర్స్ సైట్ Amazonలో భారీ ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ తగ్గింపుతో చాలా తక్కువ ధరకే ఈ మొబైల్‌ను సొంతం చేసుకోవచ్చు.
Samsung Galaxy A55 5G Price
Samsung Galaxy A55 5G ఫోన్‌లో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లాంచ్ సమయంలో రూ.39,999గా ఉంది. అయితే ఇప్పుడు రూ.14,000 తగ్గింపుతో కేవలం రూ.25,999లకే సొంతం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అదే సమయంలో ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ధరను రూ.24,200 వరకు తగ్గించవచ్చు. అయితే ఫోన్ కండీషన్ మెరుగ్గా ఉండాలి.
Also Read : అనంతపురంలో ఇంటర్ విద్యార్థినీ దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు
Samsung Galaxy A55 5G Specifications
Samsung Galaxy A55 5G ఫోన్ 6.6-అంగుళాల పూర్తి-HD + సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1,080x2,408 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,000 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఇది 4nm Exynos 1480 ప్రాసెసర్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ONE UI 6.1పై నడుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వచ్చింది.
Galaxy A55 5G వెనుక భాగంలో ఆటోఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. అదే సమయంలో ఇది సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP67 రేటింగ్‌తో అమర్చబడింది.