BIG BREAKING: జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్

జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు హైదరాబాద్‌లో అరెస్ట్ అయ్యారు. జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంట్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పీఎస్‌లో కేసు నమోదైంది. 

New Update
Kommineni Srinivasa Rao

జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు హైదరాబాద్‌లో అరెస్ట్ అయ్యారు. జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంట్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పీఎస్‌లో కేసు నమోదైంది. ఓ ఛానల్‌లో అమరావతి రైతుల ధర్నాపై ఆయన డిబెట్ నిర్వహించారు. ఈ సందర్భంలో డిబెట్‌లో పాల్గొన్న మరో జర్నలిస్టు వాడపల్లి కృష్ణంరాజు నోరు జారారు. 

రాజధాని ప్రాంతంలో వేశ్యలు ఉన్నారని కృష్ణంరాజు అన్నారు. ఆ సమయంలో ఆయన మాటల్ని డిబెట్ నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో అమరావతి ప్రాంతంలోని మహిళా నాయకులు వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు.అమరావతి మహిళలను కించపరిచిన కేసులో ఏపీ తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో వారిద్దరిపై ఫిర్యాదు చేశారు.  హైదరాబాద్‌ నుంచి కొమ్మినేని శ్రీనివాస్‌ రావును విజయవాడ తరలిస్తున్నారు. విజయవాడ అయోధ్యనగర్ కాలనీలోని ఇంటికి తాళం వేసి కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్లారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు