Errol Musk: ఎలాన్‌ మస్క్‌పై ట్రంపే గెలుస్తారు: ఎర్రోల్‌ మస్క్‌

ట్రంప్, ఎలాన్ మస్క్‌ మధ్య నెలకొన్న వివాదంపై మస్క్ తండ్రి ఎర్రోల్‌ మస్క్‌ స్పందించారు. రిపబ్లికన్ ట్యాక్స్‌ బిల్లు వల్లే వీళ్లిద్దరి మధ్య వివాదం జరిగిందని తెలిపారు. ఈ వివాదంలో ట్రంప్ గెలుస్తారని చెప్పారు. ఇప్పటికైనా ఇద్దరూ కలిసి పనిచేయాలని సూచించారు.

New Update
Errol Musk Blames Elon's Trump Clash On PTSD, Predicts President's Win In Heated Spat

Errol Musk Blames Elon's Trump Clash On PTSD, Predicts President's Win In Heated Spat

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ప్రపంచ కుబేరుడు  ఎలాన్‌ మస్క్‌ మధ్య విభేదాలు ముదురుతున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష ఎన్నికలకు ముందు స్నేహంగా ఉన్న వీళ్లిద్దరూ ఇప్పుడు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ట్రంప్‌ కోసం ఎన్నికల్లో బిలియన్ల డాలర్లు ఖర్చు చేసిన మస్క్‌ ఇప్పుడు ట్రంప్ తీరును తప్పుపడుతున్నారు. అంతేకాదు ది అమెరికన్ పార్టీ పెడుతానంటూ కూడా ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ఇటీవల డోజ్‌ శాఖ నుంచి వైదొలగిన ఎలాన్ మస్క్‌.. బహిరంగంగా ట్రంప్‌పై తీవ్ర ఆరోపణలు చేయడం దుమారం రేపుతోంది.    

Also Read: లోకల్ ట్రైన్ నుంచి జారి పడి ఐదుగురు స్పాట్ డెడ్ - షాకింగ్ వీడియో

Errol Musk Blames Elon's Trump Clash On PTSD

ప్రస్తుతం ఇలా ట్రంప్, మస్క్‌ మధ్య వివాదం నెలకొన్న వేళ.. తాజాగా ఎలాన్ మస్క్‌ తండ్రి ఎర్రోల్‌ మస్క్‌ స్పందించారు. ట్రంప్‌ తీసుకొచ్చిన రిపబ్లికన్ ట్యాక్స్‌ బిల్లు వల్లే వీళ్లిద్దరి మధ్య వివాదం జరిగిందని తెలిపారు. ట్రంప్ తీసుకొచ్చిన బిల్లు వల్ల తీవ్ర అసహనానికి గురయ్యాడని.. అందుకే ట్రంప్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడని చెప్పారు.  '' ట్రంప్‌ ప్రవేశపెట్టిన ట్యాక్స్‌ బిల్లును ఎలాన్ మస్క్‌ వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంలో మస్క్‌కు అసహనం పెరగడంతోనే ట్రంప్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్‌, సెనేట్‌లో మెజార్టీ ఓట్లను పొందడం కోసం ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఎలాన్‌ మస్క్‌కు తెలియదు.  

Also Read: బెంగుళూరు తొక్కిసలాట కారణంగా స్టేడియం తరలింపు!!

దీన్ని ఎలాన్ మస్క్‌ అర్థం చేసుకోలేకపోయారు. ట్రంప్‌ ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో ఈ వివాదంలో ఎలాన్‌ మస్క్‌పై ఆయనే గెలిచే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇరువురు తమ విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని కోరుతున్నానని'' ఎర్రోల్‌ మస్క్‌ చెప్పారు. రష్యాలోని మాస్కోలో నిర్వహించిన ఓ ఫోరమ్‌లో ఎలాన్‌ మస్క్‌ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.  

Also Read:  270 ఏళ్ళ తర్వాత అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకమ్

Also Read :  అశ్లీల చిత్రాల్లో నటించాలని ఒత్తిడి.. 6 నెలలు చిత్రహింసలకు గురైన యువతి

 

telugu-news | rtv-news | Errol Musk | latest-telugu-news | today-news-in-telugu | Elon Musk | Donald Trump | international news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు