/rtv/media/media_files/2025/06/09/MhEOlATFOFLjhcqY7BOB.jpg)
CM Revanth Reddy to Delhi: తెలంగాణ మంత్రివర్గం(Telangana Cabinet)లోకి కొత్తగా ముగ్గురు మినిస్టర్లకు తీసుకున్న విషయం తెలిసిందే. వారి ప్రమాణస్వీకారం కూడా ఆదివారం రాజ్‌భవన్(Raj Bhavan)లో అయిపోయింది. అయితే వారికి ఇవ్వనున్న శాఖలు ఇంకా ఖరారు కాలేదు. సోమవారం ఉదయం 10గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీ చేరుకుంటారు. ఈరోజు సాయంత్రం వరకూ కొత్త మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం #TelanganaRising#TelanganaCongress#RevanthReddy#congres#todaynews#latestnewspic.twitter.com/xCxo9f8Yup
— Hastavasi (@hasta_vasi) June 8, 2025
Also Read : అనంతపురంలో ఇంటర్ విద్యార్థినీ దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు
హైకమాండ్‌తో చర్చలు
అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీ గురించి ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతల గురించి కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో చర్చించే అకాశం ఉంది.