Live News Updates: ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

Weather Update: ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో 16వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

telangana weather report

దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో 16వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం, కేరళ, కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలంతా బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్త అని అధికారులు తెలిపారు.

Also Read: Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు

ఏపీలో ఈ జిల్లాల్లో..

నేడు ఏపీ(Andhra Pradesh)లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.

Also Read:Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్

తెలంగాణలో ఈ జిల్లాల్లో..
తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 

Also Read:BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్

  • Jul 11, 2025 17:59 IST

    AP CRIME: ఏపీలో మరో భార్య మర్డర్.. అనుమానంతో పొడిచి పొడిచి చంపిన భర్త

    అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం వంగలమడుగులో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో భర్త జోగిదొర తన భార్య విజయకుమారి (39)ని కత్తితో పొడిచి చంపాడు. స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

     

    husband killed his wife in alluri sitarama raju district
    husband killed his wife in alluri sitarama raju district

     



  • Jul 11, 2025 17:31 IST

    Dhadak 2 Trailer: సిద్ధాంత్- త్రిప్తి రొమాన్స్ . 'ధడక్ 2' ట్రైలర్ భలే ఉంది!

    సిద్ధాంత్ చతుర్వేది, యానిమల్ బ్యూటీ త్రిప్తి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'ధడక్ 2' ట్రైలర్ విడుదలైంది. ప్రేమ, భావోద్వేగ సన్నివేశాలతో  ట్రైలర్ సాగింది. ఇందులో  సిద్ధాంత్ చతుర్వేది,  త్రిప్తి  మధ్య కెమిస్ట్రీ బాగా కనిపించింది.

     

    Dhadak 2 Trailer
    Dhadak 2 Trailer

     



  • Jul 11, 2025 17:30 IST

    VIral Video : OYOలో ప్రియుడితో భార్య.. భర్త రాగానే బట్టల్లేకుండా పరుగో పరుగు

    ఓ భార్య తన ప్రియుడితో ఓయో రూమ్‌కి వెళ్లింది. ఆమె కదిలికలపై అనుమానం వచ్చిన భర్త తన పిల్లలతో కలిసి ఆమె వెళ్లిన చోటుకు వెళ్లాడు. అక్కడ ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న ఆమెను  భర్తకు రెడ్ హ్యాండెడ్  గా దొరికిపోయింది.

    meerut wife



  • Jul 11, 2025 16:44 IST

    Maharashtra: శివసేన ఎమ్మెల్యేకు బీజేపీ సర్కార్ బిగ్ షాక్ !

    ముంబైలోని ఎమ్మెల్యే గెస్ట్ హౌస్‌లో క్యాంటీన్ సిబ్బందిపై దాడికి పాల్పడిన  శివసేన (షిండే వర్గం) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని చర్యలు ప్రారంభించారు.

    Sanjay Gaikwad



  • Jul 11, 2025 16:44 IST

    Amazon Prime Day Sale 2025: సూపర్ టిప్స్.. అమెజాన్ సేల్‌లో ఈ చిట్కాలు పాటిస్తే వేలల్లో డబ్బు ఆదా!

    అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025 ఈరోజు రాత్రి 12 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ సేల్‌లో తెలివిగా షాపింగ్ చేస్తే చాలా డబ్బును ఆదా చేసుకోవచ్చు. సరైన సమయంలో బ్యాంక్ కార్డ్, ముందస్తు ప్రణాళిక, నోటిఫికేషన్లపై ప్రత్యేక శ్రద్ధ చూపడం ద్వారా డబ్బు చాలా మిగులుతుంది.

     

    Amazon Prime Day Sale 2025
    Amazon Prime Day Sale 2025

     



  • Jul 11, 2025 11:32 IST

    కాళేశ్వరం విచారణలో హరీష్ రావు బిగ్ ట్విస్ట్.. కమిషన్ కు ఆ వివరాలు అందజేత!

    బీఆర్ఎస్ లీడర్ హరీశ్ రావు శుక్రవారం BRK భవన్‌కు వెళ్లారు. జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షత కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై అదనపు సమాచారాన్ని హరీశ్ రావు విచారణ కమిషన్‌కు అందించారు.

    Harish Rao



  • Jul 11, 2025 11:31 IST

    Tennis player Radhika: హత్యకేసులో షాకింగ్ విషయాలు.. గ్రామస్థులు అలా అన్నందుకే కూతుర్ని చంపిన తండ్రి

    టెన్నిస్ ప్లేయర్ రాధిక హత్య కేసు FIRలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె తండ్రి దీపక్ ఏపని చేయకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటాడు. కూతురి సంపాదనతో బతుకుతున్నాడని గ్రామస్థులు హేళన చేయడంతో అతను అవమానంగా భావించాడు. దీంతో కూతుర్ని కాల్చి చంపాడు.

    radhika yadav tennis player



  • Jul 11, 2025 11:30 IST

    140 కోట్ల మందిని గాలికి వదిలేసి.. ప్రధాని మోదీపై పంజాబ్ సీఎం తీవ్ర విమర్శలు

    ప్రధాని మోదీ ఇటీవల 5 దేశాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మోదీ విదేశీ పర్యటనలపై పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 140 కోట్ల మంది ప్రజలు ఉన్న భారత్‌ను వదిలేసి.. కేవలం 10 వేల మంది జనాభా ఉన్న దేశాల్లో మోదీ పర్యటించడాన్ని ఆయన విమర్శించారు.

    PM Modi foreign visits



  • Jul 11, 2025 11:30 IST

    కెనడాపై పగపట్టిన ట్రంప్.. ట్యాక్సుల రూపంలో చుక్కలే

    ఆగస్టు 1 నుంచి కెనడా ఎగుమతులపై 35 శాతం సుంకాన్ని ఎదుర్కోనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీకి లేఖ రాశాడు. అమెరికాతో కలిసి పనిచేయడానికి బదులుగా, కెనడా తన సొంత సుంకాలతో ప్రతీకారం తీర్చుకుంది.

     

    trump tariffs
    trump tariffs

     



  • Jul 11, 2025 11:29 IST

    TG Surpanch Elections: ఫస్ట్ ఎంపీటీసీ, తర్వాత సర్పంచ్.. స్థానిక ఎన్నికలపై రేవంత్ సర్కార్ వ్యూహం ఇదే!

    స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంతో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మొదట పరిషత్‌ ఎన్నికలే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ZPTC, MPTC ఎన్నిలక తర్వాతే సర్పంచ్‌ ఎన్నికలకు వెళ్లాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది.

     

    Local Body Elections
    Local Body Elections

     



  • Jul 11, 2025 11:29 IST

    నదిలో కూలిపోయిన ఆర్మీ హెలికాప్టర్

    మలేషియాలో ఓ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ నదిలో కూలిపోయింది. జోహోర్‌ రాష్ట్రంలోని పులాయ్‌ నదిలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మాక్ డ్రిల్ సందర్భంగా జరిగినట్లు మలేషియా పౌరవిమానయాన శాఖ పేర్కొంది.

    Army helicopter crashes



  • Jul 11, 2025 11:28 IST

    తెలంగాణ జాగృతి ఆఫీస్‌లో కవిత సంబరాలు (VIDEO)

    బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి ఆఫీస్‌లో సంబరాలు చేసుకున్నారు. జాగృతి కార్యకర్తలు, ఆమె అభిమానులతో కలిసి రంగులు చల్లుకున్నారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.

    Kavitha celecrations



  • Jul 11, 2025 11:27 IST

    Operation Baam: పాక్ మిలిటరీ స్థావరాలపై భీకర దాడులు.. 18 చోట్ల బాంబ్ బ్లాస్ట్‌లు

    పాకిస్థాన్‌పై బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ మరోసారి విరుచుకుపడింది. బలూచిస్థాన్‌లోని పలు జిల్లాల్లో మిలిటరీ భీకర దాడులకు పాల్పడింది. ప్రభుత్వ కార్యాలయాలు, మిలిటరీ స్థావరాలు లక్ష్యంగా 'ఆపరేషన్‌ బామ్‌' పేరుతో ఏకకాలంలో దాడులు చేసింది బీఎల్ఏ.

     

    BREAKING NEWS
    BREAKING NEWS

     



  • Jul 11, 2025 11:08 IST

    Maharashtra: ఎంజాయ్ కోసం కొండపై కారుతో స్టంట్‌లు.. చివరకు 300 అడుగుల లోయలో పడి..!

    మహారాష్ట్రలోని సదావాఘపూర్ ప్రాంతానికి వెళ్లిన సరదాగా ఫ్రెండ్స్‌తో ఫొటోలు తీసుకుంటుండగా కారు తిప్పడంతో లోయలో పడింది. బ్రేక్‌లు వేయకపోవడం వల్ల లోయలో కారు పడటంతో సాహిల్ జాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

    Car



  • Jul 11, 2025 10:04 IST

    GHMC: కేవలం రూ.5 కే బ్రేక్ ఫాస్ట్.. హైదరాబాద్ వాసులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

    హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకానికి రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది. హరేకృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ టిఫిన్స్ ఇవ్వనున్నారు. వీటికి రూ.19 ఖర్చు అవుతుండగా ప్రజల నుంచి కేవలం 5 రూపాయలు మాత్రమే తీసుకుంటారు.

     

    GHMC
    GHMC

     



  • Jul 11, 2025 10:03 IST

    Ukraine-Russia: రష్యాకు చుక్కలు చూపించిన ఉక్రెయిన్!

    కొంత కాలంగా ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఈ క్రమంలో డొనెట్స్క్ రిజియన్‌లో రోడ్లపై యాంటీ డ్రోన్ల వలలు ఉక్రెయిన్ ఏర్పాటు చేసింది. రష్యా దాడుల నుంచి రక్షిణ పొందడానికి ఉక్రెయిన్ అధికారులు ఈ ప్లాన్ వేశారు.

     

    Nets
    Nets

     



  • Jul 11, 2025 10:03 IST

    Telangana: తెలంగాణలో విషాదం.. కరెంట్ షాక్‌తో రైతు మృతి

    సూర్యాపేట జిల్లాలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన విషాదం ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆన్‌ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి రైతు దొంతగాని నాగయ్య(45) మృతి చెందారు.

     

    Current shock guntur
    Current shock guntur

     



  • Jul 11, 2025 10:02 IST

    Shubhanshu Shukla: శుభాంశు శుక్లా ప్రయాణం వాయిదా.. తిరిగి ఎప్పుడంటే?

    ప్రస్తుతం అంతరిక్ష యాత్ర చేస్తున్న వ్యోమగామి శుభాంశు శుక్లా తిరుగు ప్రయాణం వాయిదా పడింది. నేడు భూమికి రావాల్సి ఉండగా.. జులై 14వ తేదీన తిరిగి రానున్నారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు జూన్ 25వ తేదీన వెళ్లారు.

    Shubhanshu Shukla



  • Jul 11, 2025 10:01 IST

    Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు

    నేడు రాశి చక్రంలోని కొన్ని రాశుల వారికి గడ్డు కాలమని చెప్పవచ్చు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా సమస్యలు తప్పవు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వీటివల్ల ధనవ్యయం అవుతుందని పండితులు అంటున్నారు.

     

    Today Horoscope
    Today Horoscope

     



Advertisment
Advertisment
తాజా కథనాలు