/rtv/media/media_files/2025/07/11/amazon-prime-day-sale-2025-2025-07-11-16-41-06.jpg)
Amazon Prime Day Sale 2025
అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025 మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఈ సేల్ ఈరోజు రాత్రి 12 గంటలకు ప్రారంభం అవుతుంది. జూలై 14 వరకు కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ప్రైమ్ సభ్యులకు ఆఫర్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, AC, టీవీ, గృహోపకరణాలు, ఫ్యాషన్ సహా చాలా వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. అలాగే కొన్ని ప్రీమియం ఉత్పత్తులపై బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.
Amazon Prime Day Sale 2025 Tips
అయితే ఈ సేల్‌లో తెలివిగా షాపింగ్ చేస్తే చాలా డబ్బును ఆదా చేసుకోవచ్చు. సరైన సమయంలో బ్యాంక్ కార్డ్, ముందస్తు ప్రణాళిక, నోటిఫికేషన్లపై ప్రత్యేక శ్రద్ధ చూపడం ద్వారా డబ్బు చాలా మిగులుతుంది. అందువల్ల సేల్ సమయంలో డబ్బును ఎలా ఆదా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Amazon Prime Day Sale 2025 విష్ లిస్ట్
డీల్స్ వచ్చిన వెంటనే అత్యధిక డిమాండ్ ఉన్న వస్తువులే ముందుగా స్టాక్ అయిపోతాయి. కాబట్టి అమ్మకం ప్రారంభమయ్యే ముందు అవసరమైన వస్తువులను విష్ లిస్ట్‌లో చేర్చుకోవాలి. తద్వారా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వాటిని ఆర్డర్ చేసుకోవచ్చు.
Amazon Prime Day Sale 2025 బ్యాంక్ ఆఫర్లు
ఈ సంవత్సరం అమెజాన్ ICICI, SBI కార్డులపై 10% వరకు తక్షణ తగ్గింపును ప్రకటించింది. అయితే దీనిపై పరిమితి, కనీస ట్రాన్షక్షన్ నిబంధనలు ఉంటాయి. కాబట్టి షాపింగ్ చేసే ముందు ఖచ్చితంగా బ్యాంక్ ఆఫర్ వివరాలను చదవాలి. అలాగే బ్యాంకు కార్డులను అకౌంట్‌కు లింక్ చేయడం ద్వారా ఈ ఆఫర్ త్వరగా పొందొచ్చు.
మిడ్‌నైట్ డీల్స్, లైట్నింగ్ డీల్స్‌పై ఫోకస్
కొన్ని డీల్స్ పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా లైట్నింగ్ డీల్స్. ఇవి త్వరగా ముగుస్తాయి. కాబట్టి వాటిని మిస్ అవ్వకూడదు. సేల్ అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది. అధిక డిమాండ్ ఉన్న అనేక ప్రొడెక్టులు మొదటి 2-3 గంటల్లో చౌకగా లభిస్తాయి.
Amazon Prime Day Sale 2025 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్స్
అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, కొన్ని ఉపకరణాలపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను అందిస్తుంది. మీ పాత డివైజ్ మంచి పెర్ఫార్మెన్స్‌లో ఉంటే దానిని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా అదనపు తగ్గింపు పొందవచ్చు. కొన్నిసార్లు రూ. 5,000 నుండి రూ. 10,000 వరకు ప్రయోజనాన్ని పొందవచ్చు.
ఈ చిట్కాలను పాటిస్తే.. Amazon Prime Day Sale 2025లో డబ్బును ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్.. కేవలం అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే ప్రత్యేకం అని చెప్పుకోవాలి.