Ukraine-Russia: రష్యాకు చుక్కలు చూపించిన ఉక్రెయిన్!

కొంత కాలంగా ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఈ క్రమంలో డొనెట్స్క్ రిజియన్‌లో రోడ్లపై యాంటీ డ్రోన్ల వలలు ఉక్రెయిన్ ఏర్పాటు చేసింది. రష్యా దాడుల నుంచి రక్షిణ పొందడానికి ఉక్రెయిన్ అధికారులు ఈ ప్లాన్ వేశారు.

New Update
Nets

Russia- Ukraine

రష్యాకు ఉక్రెయిన్ బిగ్ షాక్ ఇచ్చింది. కొంత కాలంగా ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే డొనెట్స్క్ రిజియన్‌లో రోడ్లపై యాంటీ డ్రోన్ల వలలు ఏర్పాటు చేసింది. రష్యా దాడుల నుంచి రక్షిణ పొందడానికి ఉక్రెయిన్ అధికారులు ఈ ప్లాన్ వేశారు. దీంతో రష్యా చేస్తున్న దాడుల వల్ల తెలివిగా ఉక్రెయిన్ బయటపడింది. దీనివల్ల ఉక్రెయిన్ పౌరులకు ఎలాంటి ప్రాణ హాని కూడా ఉండదు. 

ఇది కూడా చూడండి: Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు

ఇది కూడా చూడండి: Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్

డ్రోన్లతో విరుచుకుపడిన..

ఇదిలా ఉండగా ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా 728 డ్రోన్లు, 13 క్షిపణులతో భీకరంగా విరుచుకుపడింది. షహెద్, డెకాయ్‌, బాలిస్టిక్‌ క్షిపణులతో బెలారస్‌ సరిహద్దుల్లో ఉన్న మొత్తం 10 ప్రాంతాలపై దాడులు చేసింది. రష్యా చేసిన ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కేవలం ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే రష్యా ప్రయోగించిన 296 డ్రోన్లు, ఏడు క్షిపణులను ఉక్రెయిన్‌ గగనతల రక్షణ వ్యవస్థ పూర్తిగా కూల్చేసింది. అయితే రష్యా డ్రోన్లను కూల్చేయడానికి ఉక్రెయిన్ ఇంటర్‌సెప్టర్లను అభివృద్ధి చేసినట్లు అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్

రష్యా దాడులు చేయడంతో ఉక్రెయిన్ తిరిగి ఎదురు దాడులు చేసింది. ఉక్రెయిన్ రష్యాపై మొత్తం 6 ప్రాంతాలపై 86 డ్రోన్లను వేయగా కూల్చివేసింది. ఈ దాడుల వల్ల దక్షిణ మాస్కోలోని కలుగా అంతర్జాతీయ విమానాశ్రయం, శేరేమేత్యేవో విమానాశ్రయాన్ని తాత్కాలింగా మూసివేశారు. ఉక్రెయిన్ రష్యాపై జరిపిన దాడుల్లో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి:  Blood Pressure: రక్తపోటు పెరగడానికి ఈ అలవాట్లే కారణమా..?ఈ రోజే దానిని తరిమి వేయండి..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు