/rtv/media/media_files/2025/07/07/trump-tariffs-2025-07-07-09-10-47.jpg)
trump tariffs
ట్రంప్ చెప్పినట్లు నడుచుకోవడం లేదని కెనడాపై పగపట్టాడు. ఆగస్టు 1 నుంచి కెనడా ఎగుమతులపై 35 శాతం సుంకాన్ని ఎదుర్కోనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీకి లేఖ రాశాడు. అమెరికాతో కలిసి పనిచేయడానికి బదులుగా, కెనడా తన సొంత సుంకాలతో ప్రతీకారం తీర్చుకుంది. ఆగస్టు 1 నుంచి యునైటెడ్ స్టేట్స్‌లోకి పంపే కెనడియన్ ఉత్పత్తులపై మేము కెనడాకు 35% సుంకాన్ని విధిస్తామని ట్రంప్ లేఖలో పేర్కొన్నారు. ఇది అన్ని రంగాల సుంకాల నుంచి వేరుగా ఉంటుందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ట్రంప్ 22 దేశాలకు కొత్త సుంకాల రేట్లను వివరిస్తూ లేఖలు విడుదల చేశారు.
New media post from Donald J. Trump (TS: 11 Jul 00:15 UTC) pic.twitter.com/Yf2YGC3h4l
— Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) July 11, 2025
బ్రెజిల్ దిగుమతులపై కూడా 50% సుంకం విధిస్తున్నట్లు తెలిపారు. ఏదైనా ప్రతీకారం తీర్చుకుంటే ఇంకా ఎక్కువ సుంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన అధికారిక లేఖలో, ట్రంప్ తన సుంకాల పెంపునకు గల కారణాలను వివరించారు .
Follow Us