GHMC: కేవలం రూ.5 కే బ్రేక్ ఫాస్ట్.. హైదరాబాద్ వాసులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకానికి రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది. హరేకృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ టిఫిన్స్ ఇవ్వనున్నారు. ఒక్కో ప్లేట్‌కి రూ.19 ఖర్చు అవుతుండగా ప్రజల నుంచి కేవలం రూ. 5 మాత్రమే తీసుకుంటారు.

New Update
GHMC

GHMC

హైదరాబాద్ వాసులకు అదిరిపోయే పథకాన్ని తీసుకురానున్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకానికి రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది. హరేకృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ టిఫిన్స్ ఇవ్వనున్నారు. అయితే ఈ టిఫిన్స్‌ ఒక్కో ప్లేట్‌కి రూ.19 ఖర్చు అవుతుండగా ప్రజల నుంచి కేవలం రూ. 5 మాత్రమే తీసుకుంటారు. మిగిలిన రూ.14 జీహెచ్ఎంసీ భరిస్తుంది. ఈ పథకం కోసం జీహెచ్ఎంసీ ఏటా రూ.15.33 కోట్లు ఖర్చు చేయనుంది.

ఇది కూడా చూడండి: Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు

ఇది కూడా చూడండి:Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్

పాత క్యాంటీన్ల మార్పుల కోసం..

అల్పాహారం అందించడానికి అవసరమైన క్యాంటీన్ కంటైనర్లు, పాత క్యాంటీన్ల మార్పుల కోసం రూ.11.43 కోట్లు ఖర్చు చేయడానికి కూడా ఆమోదం లభించింది. నగరంలోని చెరువులను కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద అభివృద్ధి చేయడానికి, సరూర్ నగర్ ట్యాంక్ బండ్ రిపేర్ల కోసం రూ. 5.60 కోట్లు కేటాయించారు. బుద్ధ భవన్ ను హైడ్రా ఆఫీసుకు, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు లీజుకు ఇవ్వడానికి ఆమోదించారు. నగరంలో కొత్తగా నిర్మించిన 23 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్వహణకు ఏటా రూ.13.59 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపారు.

ఇది కూడా చూడండి:BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్

Advertisment
Advertisment
తాజా కథనాలు