నదిలో కూలిపోయిన ఆర్మీ హెలికాప్టర్

మలేషియాలో ఓ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ నదిలో కూలిపోయింది. జోహోర్‌ రాష్ట్రంలోని పులాయ్‌ నదిలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మాక్ డ్రిల్ సందర్భంగా జరిగినట్లు మలేషియా పౌరవిమానయాన శాఖ పేర్కొంది.

New Update
Army helicopter crashes

మలేషియాలో ఓ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ నదిలో కూలిపోయింది. జోహోర్‌ రాష్ట్రంలోని పులాయ్‌ నదిలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా, అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటన మాక్ డ్రిల్ సందర్భంగా జరిగినట్లు మలేషియా పౌరవిమానయాన శాఖ పేర్కొంది. మిత్సతోమ్‌ 2025 పేరిట మలేషియాతో కలిసి సింగపూర్‌, ఇండోనేషియా, థాయ్‌ల్యాండ్‌లు నిర్వహించిన బహుళ దేశాల అణు భద్రతా కసరత్తులో ఈ హెలికాప్టర్‌ భాగంగా పాల్గొంది.

ఈ క్రమంలో తంజుంగ్ కుపాంగ్‌లోని పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరిన మలేషియా ఎయిర్‌బస్‌ AS355N హెలికాప్టర్‌, గెలాంగ్‌ పాటాలో ఉన్న మలేషియా మారిటైమ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ జెట్టీ సమీపంలోకి రాగానే అదుపుతప్పి నదిలో పడిపోయింది. దీంతో వెంటనే రెస్క్యూ బృందాలు స్పందించి పైలట్‌తో పాటు ఐదుగురిని బయటకు తీశాయి. గాయపడిన వారిలో ఇద్దరు సీనియర్ పోలీస్‌ అధికారులు ఉన్నారు. అయితే వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 

Advertisment
Advertisment
తాజా కథనాలు