140 కోట్ల మందిని గాలికి వదిలేసి.. ప్రధాని మోదీపై పంజాబ్ సీఎం తీవ్ర విమర్శలు

ప్రధాని మోదీ ఇటీవల 5 దేశాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మోదీ విదేశీ పర్యటనలపై పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 140 కోట్ల మంది ప్రజలు ఉన్న భారత్‌ను వదిలేసి.. కేవలం 10 వేల మంది జనాభా ఉన్న దేశాల్లో మోదీ పర్యటించడాన్ని ఆయన విమర్శించారు.

New Update
PM Modi foreign visits

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఐదు దేశాల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. మోదీ విదేశీ పర్యటనలపై పంజాబ్ సీఎం, ఆప్ లీడర్ భగవంత్‌ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 140 కోట్ల మంది ప్రజలు ఉన్న భారత్‌ను వదిలేసి.. కేవలం 10 వేల మంది జనాభా ఉన్న దేశాల్లో మోదీ పర్యటించడాన్ని ఆయన విమర్శించారు. భగవంత్ మాన్ సింగ్ మాట్లాడుతూ.. ప్రధాని ఘనా అని ఎక్కడికో వెళ్లారు. స్వదేశానికి తిరిగివస్తున్న ఆయనకు స్వాగతం. ప్రధాని ఏయే దేశాలకు వెళ్తున్నారో ఆ దేవుడికే తెలియాలి. 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో మన ప్రధాని ఉండరు. కానీ, పది వేల మంది జనాభా ఉన్న దేశాలను మాత్రం సందర్శిస్తున్నారు. అక్కడ ఆయనకు అత్యున్నత అవార్డులు కూడా అందుతున్నాయి’ అని మాన్‌ పేర్కొన్నారు. 

ఈ వ్యాఖ్యలపై విదేశాంగశాఖ మండిపడింది. ప్రధాని విదేశీ పర్యటనలపై రాష్ట్రంలోని ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని పరోక్షంగా స్పందించారు. అవి పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని తెలిపింది. ఈ వ్యాఖ్యలు వారి స్థాయిని తగ్గించేవని ఫైర్ అయ్యింది. భారత్‌తో స్నేహపూర్వకంగా మెలిగే దేశాలను తక్కువ చేసి మాట్లాడటం మంచిదికాదని విదేశాంగ శాఖ తెలిపింది. ఈనెల 2 నుంచి మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారు. ఘనా, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్‌, నమీబియాల్లో ఆయన పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆయా దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి ప్రసంగించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు