/rtv/media/media_files/2025/07/11/radhika-yadav-tennis-player-2025-07-11-10-56-35.jpg)
Tennis player Radhika Murder Case:
నేషనల్ టెన్నిస్ క్రీడాకారిణి రాధిక(25) గురువారం కన్నతండ్రే రివాల్వర్‌తో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం చోటుచేసుకుంది. అయితే ఈకేసు FIRలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధికను ఎందుకు చంపాడో ఆమె తండ్రి దీపక్ పోలీసుల ముందు చెప్పేశాడు. దీపక్ ఏపని చేయకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటాడు. కూతురి సంపాదనతో బతుకుతున్నాడని గ్రామస్థులు హేళన చేయడంతో అతను అవమానంగా భావించాడు.
25 YO STATE LEVEL TENNIS PLAYER RADHIKA YADAV WAS SHOT DEAD BY HER FATHER!
— zig sports (@zig_sports) July 11, 2025
Reason reavealed was Radhika running a sports academy in their native Wazirabad village!
Absolute Heartbreaking 💔💔💔#RadhikaYadavpic.twitter.com/WfmQGDONn4
Also Read: Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు
అవమానం భరించలేక..
రాధిక గురుగ్రామ్‌లో టెన్నీస్ అకాడమీ నిర్వహిస్తున్నది. అకాడమీని మూసివేయాలని తండ్రి కూతుళ్ల మధ్య చాలాసార్లు వాగ్వాదం జరిగింది. అదే విషయంలో గురువారం మరోసారి రాధిక, ఆమె తండ్రి దీపక్‌తో గొడవ జరిగింది. ఈక్రమంలో ఆవేశానికి గురైన తండ్రి టేబుల్‌పై రివాల్వార్ తీసి కాల్చి చంపాడు. రాధిక ఓ వీడియో సాంగ్‌లోనూ నటించింది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. దీంతో కూతురు డబ్బులపై బతుకుతున్నావని దీపక్‌ని ఇరుగుపోరుగు వారు, గ్రామస్థులు హేళన చేస్తుండేవారు. దీంతో అతడు కూతురిని రివాల్వార్‌తో కాల్చి హత్య చేశాడు.
Also Read: Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్