Maharashtra: శివసేన ఎమ్మెల్యేకు బీజేపీ సర్కార్ బిగ్ షాక్ !

ముంబైలోని ఎమ్మెల్యే గెస్ట్ హౌస్‌లో క్యాంటీన్ సిబ్బందిపై దాడికి పాల్పడిన  శివసేన (షిండే వర్గం) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని చర్యలు ప్రారంభించారు.

New Update
Sanjay Gaikwad

Maharashtra MLA Sanjay Gaikwad

Maharashtra: ముంబైలోని ఎమ్మెల్యే గెస్ట్ హౌస్‌(MLA Guest House)లో క్యాంటీన్ సిబ్బందిపై దాడికి పాల్పడిన  శివసేన(Shiva Sena) (షిండే వర్గం) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్(MLA Sanjay Gaikwad) కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై ముంబై పోలీసులు(Mumbai Police) కేసు నమోదు చేసుకుని చర్యలు ప్రారంభించారు.  సంజయ్ గైక్వాడ్‌పై నాన్-కాగ్నిజబుల్ అఫెన్స్ (ఎన్‌సి) నమోదు చేసే ప్రక్రియ జరుగుతోంది.  ఇటీవల ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ క్యాంటీన్‌లో తనకు పాచిపోయిన ఆహారం (పప్పు, అన్నం) వడ్డించారనే కోపంతో ఆయన ఒక క్యాంటీన్ ఉద్యోగిపై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Maharashtra CM Devendra Fadnavis) కూడా స్పందిస్తూ, ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని, శాసనసభ్యుల ప్రతిష్టను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.

ఇది శివసేన స్టైల్

అయితే, సంజయ్ గైక్వాడ్ మాత్రం తన చర్యను శివసేన స్టైల్ అని సమర్థించుకున్నారు. ఈ సంఘటన తర్వాత మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) క్యాంటీన్ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ అజంతా క్యాటరర్స్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసింది. క్యాంటీన్ వివాదం తర్వాత, సంజయ్ గైక్వాడ్ దక్షిణాది వారిపై జాతి విద్వేష వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో డాన్స్ బార్లు, లేడీస్ బార్లను నడుపుతూ దక్షిణాది వారు మహారాష్ట్ర సంస్కృతిని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టులను మరాఠీ వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు.  గతంలో రాహుల్ గాంధీ రిజర్వేషన్ల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, ఆయన నాలుక కోసిన వారికి రూ. 11 లక్షల బహుమతి ఇస్తానని సంజయ్ గైక్వాడ్ ప్రకటించి తీవ్ర దుమారం రేపారు. దీనిపై ఎఫ్.ఐ.ఆర్. కూడా నమోదైంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు