Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్

ఇండియా కొత్త కెప్టెన్ శుభ్ మన్ గిల్ రెచ్చిపోతున్నాడు. ఒక పక్క సెంచరీలను బాదుతూనే కెప్టెన్ గా కూడా తన సత్తా చాటుతున్నాడు. ఈరోజు లార్డ్స్ టెస్ట్ లో నోటికి సైతం పని చెప్పి తాను ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నాడు. 

New Update
Shubman Gill HISTORY CREATED IN IND VS ENG SECOND TEST MATCH

Shubman Gill HISTORY CREATED IN IND VS ENG SECOND TEST MATCH

శభ్ మన్ గిల్..ఇటగాడిగా తప్ప కెప్టెన్ గా అస్సలు అనుభవం లేదు. టెస్ట్ లలో పెద్దగా రాణించిందీ లేదు. ఇంగ్లాండ్ టూర్ లో ఏం చేస్తాడో అనుకున్నారు అందరూ. కానీ గల్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇంగ్లాండ్ టెస్ట్ లలో చితక్కొడుతున్నాడు. వరుసపెట్టి సెంచరీలు చేస్తూ బ్యాటర్ గా తన టాలెంట్ చూపిస్తున్నాడు. మరోవైు కెప్టెన్ గా కూడా శభాష్ అనిపించుకుంటున్నాడు . ఈరోజు మొదలైన లార్డ్స్ టెస్ట్ లో స్లెడ్జింగ్ కూడా చేసి ఇందులోనూ తాను తక్కువ కాని నిరూపించుకున్నాడు. 

బ్రిటీష్ బ్యాటర్లను కవ్వించిన కెప్టెన్..

టెస్ట్ క్రికెట్ ను ఇప్పుడు బజ్ బాల్ గేమ్ అని పిలుస్తున్నారు. ఒకప్పుడు స్లో గా అయ్యే టెస్ట్ మ్యాచ్ లు ప్రస్తుతం వేగంగా అవుతున్నాయి. క్రికెటర్లు తొందరగా రన్స్ చేస్తూ  టెస్ట్ క్రికెట్ ను కూడా ఆసక్తికరంగా మారుస్తున్నారు. అందుకే దీనికి బజ్ బాల్ అని పేరు పెట్టారు. ఇంగ్లాండ్ సీరీస్ లో మొదట జరిగిన రెండు మ్యాచ్ లూ ఈ బజ్ బాల్ తరహాలో అయ్యాయి. కానీ ఈరోజు లార్డ్స్ లో మొదలైన మ్యాచ్ లో మాత్రం బజ్ బాల్ గేమ్ కనిపించడం లేదు. మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ చాలా స్లోగా ఆడుతోంది. దీంతో మ్యాచ్ బోరింగ్ గా సాగుతోంది. ఎప్పుడూ 4 - 5 మధ్య ఉండే ఇంగ్లాండ్‌ రన్‌ రేటు సుమారు మూడు దగ్గరే ఉంది. దీంతో బజ్‌ బాల్‌  ఎక్కడికి పోయింది అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.  

ఈ క్రమంలో టీమ్ ఇండియా ప్లేయర్లకు కూడా ఇదే అనిపించినట్టుంది. నెమ్మదిగా ఆడుతున్న ఇంగ్లాండ్ బ్యాటర్లను పోక్ చేయడం మొదలుపెట్టారు. ఒక పక్క బంతి బాగా స్వింగ్ అవుతూ బ్యాటింగ్ చేయడానికి కష్టంగా ఉంటే మోవైపు భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ స్లెడ్జింగ్ తో బ్రిటీష్ బ్యాటర్లను కవ్వించే ప్రయత్నం చేశాడు. వెల్ కమ్ టూ బోరింగ్ టెస్ట్ క్రికెట్..నో ఎంటర్టైన్ మెంట్ అంటూ కామెంట్స్ చేశాడు. మరోవైపు బజ్‌ బజ్‌ బజ్‌ బాల్‌.. నేను బజ్‌ బాల్‌ చూడాలి అంటూ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా మాట్లాడ్డం వినిపించింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్టేడియంలో ఉన్న ఇంగ్లాండ్ అభిమానులు ‘బోరింగ్ క్రికెట్’ కామెంట్స్ చేశారు. ఇప్పుడు దానికి బదులుగా భారత క్రికెటర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లను స్లెడ్జింగ్ చేశారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు