Dhadak 2 Trailer: సిద్ధాంత్ చతుర్వేది, యానిమల్ బ్యూటీ త్రిప్తి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'ధడక్ 2' ట్రైలర్ విడుదలైంది. ప్రేమ, భావోద్వేగ సన్నివేశాలతో ట్రైలర్ సాగింది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. కాలేజీ విద్యార్థులుగా ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారడం, ఆ తర్వాత కుల వివక్ష కారణంగా వీరు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు? అనే అంశాలను ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్ నిండా భావోద్వేగ సన్నివేశాలు, ప్రేమ కోసం పోరాటం, కుటుంబాలను ఎదిరించడం, చివరికి ప్రాణాలను పణంగా పెట్టడం వంటివి ప్రేక్షకులను కదిలించేలా ఉన్నాయి.
Finally, the season of love stories is returning. #Dhadak2Trailer is impressive and stays true to the legacy of #Dhadak when it comes to intense drama combining well with romance.
— Joginder Tuteja (@Tutejajoginder) July 11, 2025
This films well be a defining moment for #SiddhantChaturvedi and #TriptiiDimri - They both are… pic.twitter.com/mKwz6H6p4s
ఆగస్టు 1న విడుదల
2018 లో వచ్చిన తమిళ సినిమా 'పారియేరుమ్ పెరుమాళ్' రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. 'ధడక్' లో జాన్వీ- ఇషాన్ కట్టర్ జంటగా కనిపించగా.. 'ధడక్ 2' లో సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి జంటగా నటించారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ తదితరులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 1న థియేటర్స్ లో విడుదల కానుంది.
Also Read:Mogali Rekulu: మొగలిరేకులు ఆపేయడానికి కారణం నేనే!.. అసలు విషయం బయటపెట్టిన RK నాయుడు!