/rtv/media/media_files/2025/02/11/UY1uqQNQAOXuoo3uy2uv.webp)
Local Body Elections
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం లభించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంతో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మొదట పరిషత్ ఎన్నికలే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ZPTC, MPTC ఎన్నిలక తర్వాతే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. ఈ రెండు ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురానుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జూలై చివరిలోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రిజర్వేషన్ ప్రక్రియ వేగం చేయనుంది.
పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్సును గవర్నర్ విడుదల చేసిన వెంటనే పరిషత్, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేయనుంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలకు మండలం యూనిట్‌గా రిజర్వేషన్లు ఖరారు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. అలాగే ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లా యూనిట్‌గా, జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో రాష్ట్రం యూనిట్‌గా ఖరారు చేయాలన్న నిర్ణయం జరిగింది. ఆర్డినెన్స్ విడుదల కాగానే పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లను ఖరారు చేసి.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అప్పగించనుంది. వాటి ఆధారంగా ఎన్నికల కమిమిషన్ ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. ఆ ప్రక్రియ ముగియగానే పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించనుంది.