🔴Live News Updates: భారత్‌తో యుద్ధం చేసేందుకు చైనాతో కలిసి పాక్‌ కుట్ర

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

Breaking News Live

🔴Live News Updates: 

Also Read :  రేషన్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త.. ఒకేసారి 3 నెలల రేషన్!

Ind-Pak War: ఉద్రిక్తతలు తగ్గించడానికి చర్చలు..భారత్, పాక్ కీలక నిర్ణయం

ఒక్క బుల్లెట్ కూడా పేల్చకూడదని...బోర్డర్ల నుంచి సైన్యాన్ని వెనక్కు మళ్లించాలని ఇరు దేశాల డీజీఎమ్వోలు నిర్ణయించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. అయితే కాశ్మీర్ లేదా సింధు జలాలపై ఒప్పందంపై ఎలాంటి చర్చలు జరగవని స్పష్టం చేసింది. మే 10, 12వ తేదీల్లో జరిగిన హాట్ లైన్ చర్చలపై ఇండియన్ ఆర్మీ ఇవాళ ప్రకటన చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. మే 10 శనివారం సాయంత్రం భూమి, వాయు, సముద్రంలో అన్ని కాల్పులు.. సైనిక చర్యలను నిలిపివేయడానికి ఒప్పందం కుదిరింది. నాలుగు రోజులు తీవ్రమైన దాడుల తర్వాత రెండు దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మే12న మధ్యాహ్నం నాలుగు గంటలకు డీజీఎమ్వోలు మళ్ళీ మాట్లాడుకున్నాయి. 

Also Read: అణు బెదిరింపులకు లొంగేది లేదు.. తేల్చి చెప్పిన రాజ్‌నాథ్ సింగ్

భారతే గెలిచింది అంటున్న టామ్ కూపర్

 భారత్‌ ఆపరేషన్ సిందూర్ లో పాక్‌, POKలోని తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అయితే దీనిపై ఆస్ట్రియన్ వార్‌ఫేర్‌ అనలిస్ట్‌ టామ్‌ కూపర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌ గ్రాండ్‌ సక్సెస్ అయినట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ అణు స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు. ఓ నేషనల్‌ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ దాడిలో పాకిస్థాన్ అణు స్థావరాలు ధ్వంసమయ్యాయి. అణు స్థావరాల ఎంట్రీ, ఎగ్జిట్‌లను భారత సైన్యం లేపేసింది. పాక్‌ వాళ్లు కూడా వాళ్ల అణు స్థావరాల్లోకి వెళ్లలేకపోతున్నారు. ఇండియా దెబ్బకు పాక్‌ గేమ్ఓవర్ అయ్యింది. వాళ్లు తమ అణు స్థావరాలు, ఎయిర్‌బేస్‌లను రక్షించుకోలేకపోయారు. దీన్నిబట్టి చూస్తే భారత్‌ గెలిచినట్లే కదా'' అని టామ్ కూపర్ అన్నారు. 

Also Read: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!

Also Read: అబ్బాయిలంటే అలెర్జీ.. పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. వైరల్ వీడియో!

  • May 16, 2025 20:26 IST

    భారత్‌తో యుద్ధం చేసేందుకు చైనాతో కలిసి పాక్‌ కుట్ర

    పాక్‌ చైనాతో కలిసి భారత్‌పై యుద్ధం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. చైనా నుంచి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకునేందుకు పాకిస్థాన్‌ ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం.

    Pakistan preparing for war against India with China Support, Sources
    Pakistan preparing for war against India with China Support, Sources

     



  • May 16, 2025 20:12 IST

    టెస్టు కెప్టెన్సీ ఇవ్వనందుకే కోహ్లీ రిటైర్మెంట్.. బీసీసీఐతో విభేధాలు!?

    విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ రిటైర్మెంట్‌పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ వీడ్కోలు తర్వాత ఇంగ్లాండు టూర్ కు కోహ్లీనే కెప్టెన్సీ చేయాలనుకున్నాడట. కానీ బీసీసీఐ కొత్త సారథికి మొగ్గుచూపడంతో కోహ్లీ టెస్టులనుంచి వైదొలిగినట్లు సమాచారం. 

    sfsf

     



  • May 16, 2025 18:48 IST

    56 మంది పాక్ సైనికులు మృతి

    బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తోంది. తాజాగా 56 మంది పాక్ సైనికులను హతమార్చామని బీఎల్‌ఏ వెల్లడించింది. పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై తుపాకులతో దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  

    Balochistan Liberation Army Attacks on Pakistan Army, 56 Killed  ?
    Balochistan Liberation Army Attacks on Pakistan Army, 56 Killed ?

     



  • May 16, 2025 16:44 IST

    భారత్‌-పాక్ యుద్ధం.. ఇతర దేశాలకు ఆయుధాల వ్యాపారం

    భారత్‌-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతుంటే ఇతర దేశాలకు మాత్రం ఇది వ్యాపారంగా మారిపోయింది. ముఖ్యంగా అమెరికా, రష్యా, చైనా దేశాలకు ఇది కలిసొచ్చింది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

    India Pakistan War is Business for other Countries
    India Pakistan War is Business for other Countries

     



  • May 16, 2025 16:43 IST

    పాకిస్తాన్ నుండి విడిపోవడం అంత ఈజీ కాదు.. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మారాలంటే ఏం చేయాలి?

    పాకిస్తాన్‌ నుంచి స్వాతంత్రం కావాలని బలుచిస్తాన్ కోరుకుంటోంది. 1950నుంచి ఉద్యమం చేస్తుండగా ఇప్పుడు ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. కానీ అంతర్జాతీయ గుర్తింపు పొందడం సాధ్యమేనా? బలూచిస్తాన్ దేశంగా స్థిరపడాలంటే ఏమి చేయాలి? పూర్తి ఆర్ఠికల్ చదవండి.  

    baluchistan pak
    baluchistan pak Photograph: (baluchistan pak)

     



  • May 16, 2025 14:28 IST

    ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన లారీ!

    ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ తీవ్రతో క్యాబిన్‌లో ఇరుక్కుపోయ్యారు.. మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలైయ్యాయి. క్షతగ్రతులను సత్తుపల్లి ఆస్పత్రికి తరలించారు.

    khammam crime news
    khammam crime news

     



  • May 16, 2025 14:05 IST

    Vallabhaneni Vamshi Case: వల్లభనేని వంశీపై మరో కేసు

    వల్లభనేని వంశీపై గన్నవరం పీఎస్ లో మరో కేసు నమోదైంది. నియోజకవర్గంలో మైనింగ్ లో అక్రమాలు జరిగాయంటూ మైనింగ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో విచారణకు త్వరలోనే కోర్టులో గన్నవరం పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేయనున్నారు.

    Vallabhaneni Vamshi Case
    Vallabhaneni Vamshi Case

     



  • May 16, 2025 14:04 IST

    Hari Hara Veera Mallu Release Date: ఇట్స్ అఫీషియల్.. వీరమల్లు డేట్ ఫిక్స్ చేశాడు.. పవర్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా..

    పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం 'హరి హర వీర మల్లు' సినిమా నుంచి బిగ్ అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాను 2025 జూన్ 12న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

    veeramallu new release date
    veeramallu new release date

     



  • May 16, 2025 12:55 IST

    Sivakarthikeyan Madharasi: జెట్ స్పీడ్ లో మురుగదాస్ ‘మధరాసి'.. రిలీజ్ ఎప్పుడంటే..?

    శివకార్తికేయన్ ఏఆర్ మురుగదాస్ కాంబోలో వస్తున్న ‘మధరాసి’ మూవీ శ్రీలంకలో ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటుంది. అయితే ఈ మూవీ సెప్టెంబర్ 5, 2025న విడుదలకానుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

    Sivakarthikeyan- Madharasi
    Sivakarthikeyan- Madharasi

     



  • May 16, 2025 12:40 IST

    Tiranga Rally Vijayawada: ఆపరేషన్ సిందూర్ సక్సెస్ పై విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ..

    ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకొని విజయవాడలో సెప్టెంబర్ 16న సాయంత్రం 7 గంటలకు తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేత పురందరీశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

    Tiranga rally Vijayawada
    Tiranga rally Vijayawada

     



  • May 16, 2025 12:40 IST

    Kajal as Mandodari in Yash Ramayana: వాటే ప్లానింగ్..! యశ్ రామాయణలో కాజల్కు దిమ్మతిరిగే రోల్..

    రణ్‌బీర్ కపూర్ - సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో కన్నడ స్టార్ యష్ నిర్మిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’లో యష్ రావణాసురుడిగా నటించనుండగా, ఆయన భార్య మండోదరిగా కాజల్ కనిపించనున్నారు. ఈ మల్టీస్టారర్ సినిమాకు నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు.

    Kajal as Mandodari in Yash Ramayana
    Kajal as Mandodari in Yash Ramayana

     



  • May 16, 2025 11:04 IST

    Techie Arrested : సిగ్గుందరా.. జై పాకిస్తాన్ అంటూ నినాదాలు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ అరెస్ట్!

    మే 9న ఆపరేషన్ సిందూర్ విజయాన్ని జరుపుకుంటుండగా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ 25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను తన బాల్కనీ నుండి పాకిస్తాన్ అనుకూలంగా జై పాకిస్తాన్  నినాదాలు చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

    pro-Pakistan slogans
    pro-Pakistan slogans

     



  • May 16, 2025 11:03 IST

    Vijay Antony Maargan: సరికొత్త ప్రయోగం చేస్తున్న విజయ్ ఆంటోనీ.. బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే!

    విజయ్ ఆంటోని హీరోగా నటించి స్వయంగా నిర్మించిన పాన్ ఇండియా మూవీ ‘మార్గన్’ జూన్ 27న విడుదలకు సిద్ధమైంది. లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను మూవీ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

    Vijay Antony Maargan
    Vijay Antony Maargan

     



  • May 16, 2025 09:15 IST

    SSMB29: రాజమౌళి, మహేశ్ బాబు సినిమాలో చియాన్ విక్రమ్?

    దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త వైరల్ అవుతోంది. ఇందులో తమిళ స్టార్ చియాన్ విక్రమ్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. 

    ssmb 29 movie updates
    ssmb 29 movie updates

     



  • May 16, 2025 07:53 IST

    PAK: భారత్ తో శాంతి చర్చలకు సిద్ధం..పాక్ ప్రధాని

    భారత్ తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఈ చర్చల్లో కాశ్మీర్ అంశం కూడా ఉంటుందని స్పష్టం చేశారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని కమ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

    Pakistan PM Shehbaz Sharif
    Pakistan PM Shehbaz Sharif

     



  • May 16, 2025 07:52 IST

    BIG BREAKING : చైనాను వణికించిన భూకంపం

    2025 మే 16 శుక్రవారం రోజున  చైనాలో భూకంపం సంభవించింది. 4.6 తీవ్రతతో  భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది,  దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది.

    international
    Mynmar Earth Quake

     



  • May 16, 2025 07:51 IST

    Nandamuri New Hero: ఇంతకీ 'NTR' ఎవరు..? నాల్గవ తరం వారసుడు పై నెటిజన్ల కామెంట్స్ హల్‌చల్!

    "NTR" అనగానే ఒకప్పుడు నందమూరి తారక రామారావు గుర్తు వచ్చేవారు. తర్వాత జూనియర్ NTR గుర్తింపు పొందాడు. తాజాగా నాల్గవ తరం వారసుడు కూడా అదే పేరుతో ఎంట్రీ ఇవ్వడంతో, నెటిజన్లు సరదాగా "Jr Jr NTR, Mini NTR, NTR³" వంటి కామెంట్లతో హంగామా చేస్తున్నారు.

    Nandamuri New Hero
    Nandamuri New Hero

     



  • May 16, 2025 06:58 IST

    Nirav Modi : నీరవ్‌ మోదీకి యూకే కోర్టు బిగ్ షాక్

    పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లోరూ. 13,000 కోట్లు ఎగబెట్టి లండన్ కు పారిపోయిన  వజ్రాల వ్యాపారి, వ్యాపారవేత్త నీరవ్ దీపక్ మోదీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్‌ను లండన్ హైకోర్టు తిరస్కరించింది. ఈ విషయాన్ని సీబీఐ తెలిపింది.

    neerav-modi
    neerav-modi

     



  • May 16, 2025 06:45 IST

    Fruits: పండ్లను సరైన రీతిలో తినటం వలన రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు

    భోజనం తర్వాత లేదా ఖాళీ కడుపుతో పండ్లు తినకూడదు. అరటిపండు, పుచ్చకాయ, మామిడి పండ్లు, దోసకాయ, పైనాపిల్, నారింజ, నిమ్మకాయ తినే సమయంలో కొద్దిగా నల్ల ఉప్పు, పుదీన, ఏలకులు గింజలు, ఎండు అల్లం పొడి కలిపి తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

    Fruits
    Fruits

     



  • May 16, 2025 06:44 IST

    AP NEWS : బస్సు కండక్టర్‌పై దాడి చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. కేసు నమోదు!

    ఓ బస్సు కండక్టర్‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్‌ బాషా తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని బెంగళూరు బస్టాండ్‌లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు నవాజ్‌బాషా, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.  

    bus-conductor attack
    bus-conductor attack

     



Advertisment
Advertisment
తాజా కథనాలు