/rtv/media/media_files/2024/11/17/IKBkQTodNT9QcUjkQXct.jpg)
రాజమౌళి సినిమా అంటే మామూలుగా ఉండదు. స్టార్లకు కుదువ కూడా ఉండదు. ఆయన ప్రతీ సినిమాలో ఊహించని ట్విస్ట్ లతో పాటూ నటులు కూడా ఉంటారు. ప్రతీసారి కొత్త పెద్ద నటులను ఎన్నుకుంటూ దూసుకుపోతున్నారు దర్శకధీరుడు. తాజాగా ఆయన సూపర్ స్టార్ మహేశ్ బాబు తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో ఇప్పటికే భాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీ రాజ్ లు నటిస్తున్న అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఇంకెవరున్నారు? కథ ఏంటి అనే విషయాలు మాత్రం ఇప్పటివరకు ఎక్కడా బయటకు రాలేదు. అమెజాన్ అడవుల్లో, జేమ్స్ బాండ్ తరహా సినిమా అని మాత్రమే తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో తమిళ స్టార్ చియాన్ విక్రమ్ కీలక పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. త్వరలోనే ఆయన షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. అయితే దీనికి సంబంధించి ఎక్కడా అధికారికంగా చెప్పలేదు. కనీసం ఇంతకు ముందు ప్రియాంక, పృథ్వీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు కూడా విక్రమ్ కానీ, మూవీ యూనిట్ కానీ ఏ పోస్ట్ పెట్టలేదు.
వెయ్యి కోట్లతో..
ఎస్ఎస్ఎంబీ29 ప్రాజెక్ట్ లో మహేశ్ బాబు, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మళయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటూ ఇండోనేషియా నటి చెలిసా కూడా హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తోంది. హాలీవుడ్ కు సంబంధించిన పలువురు నటీనటులు కూడా నటిస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఆస్కార్ ఆవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు హాలీవుడ్ కు చెందిన టాప్ టెక్నీషియన్లు వీఎఫ్ఎక్స్ వర్క్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు వెయయి కోట్ల బడ్జెట్ తో రూపొందుతోందని చెబుతున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత కేఎల్ నారాయణ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ29 చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చిత్రంలో కీలక సన్నివేశాలు, యాక్షన్ సీన్లను ఎస్ఎస్ రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. మరోవైపు సాంగ్ షూట్ కూడా కొనసాగుతోందని తెలుస్తోంది. రీసెంట్ గానే ఇటలీలో మొదటి పాట షూటింగ్ పూర్తి చేసుకున్నారంట. మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా కలిసి ఈసాంగ్ లో దుమ్ములేపారని టాక్ వినిపిస్తోంది.
today-latest-news-in-telugu | ss-rajamouli | mahesh babu | vikram
Also Read: Cricket: రోహిత్ తర్వాత భారత టెస్ట్ కెప్టెన్సీ ఎవరికి? రేస్ లో ముగ్గురు..