Nirav Modi : నీరవ్‌ మోదీకి యూకే కోర్టు బిగ్ షాక్

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లోరూ. 13,000 కోట్లు ఎగబెట్టి లండన్ కు పారిపోయిన  వజ్రాల వ్యాపారి, వ్యాపారవేత్త నీరవ్ దీపక్ మోదీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్‌ను లండన్ హైకోర్టు తిరస్కరించింది. ఈ విషయాన్ని సీబీఐ తెలిపింది.

New Update
neerav-modi

neerav-modi

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లోరూ. 13,000 కోట్లు ఎగబెట్టి లండన్ కు పారిపోయిన  వజ్రాల వ్యాపారి, వ్యాపారవేత్త నీరవ్ దీపక్ మోదీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్‌ను లండన్ హైకోర్టు తిరస్కరించింది. ఈ విషయాన్ని  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తెలిపింది. లండన్‌లోని కింగ్స్ బెంచ్ డివిజన్‌లోని హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిందని దర్యాప్తు సంస్థ తెలిపింది. లండన్ కు వెళ్లిన సీబీఐ బృందం..  కోర్టులో నీరవ్ మోదీ తరుపు లాయర్ వాదనలను వ్యతిరేకించింది. బెయిల్ రాకుండా అడ్డకుంది.

2019 మార్చి నుండి యూకే  జైలులో

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ. 6498.20 కోట్ల రుణ మోసం కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితులలో ఒకరైన నీరవ్ మోడీ 2019 మార్చి నుండి యూకే  జైలులో ఉంటున్నాడు. ఇది అతనికి 10వ బెయిల్ పిటిషన్. కాగా అతన్ని భారతదేశానికి అప్పగించడానికి యూకే హైకోర్టు ఇప్పటికే ఆమోదం తెలిపింది. నీరవ్‌ను మోదీని ఇండియాకు తీసుకురావడం కోసం కేంద్రం ప్రభుత్వం చాలానే  ప్రయత్నాలు చేస్తోంది. 2021లో నీరవ్‌ను భారత్‌కు అప్పగించడానికి అప్పటి బ్రిటన్‌ హోం మంత్రి ప్రీతి పటేల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అతడు లండన్‌ హైకోర్టులో అప్పీల్ చేసుకోగా కోర్టు అతడికి బిగ్ షాక్ ఇస్తూ తిరస్కరించింది. ఇప్పటివరకు నీరవ్‌ మోదీ పదిసార్లు కోర్టులో బెయిల్‌ దరఖాస్తు కోగా పాపం అన్ని సార్లు అతనికి భంగపాటు ఎదురైంది.  

UK court | Bail Plea | telugu-news 

Advertisment
తాజా కథనాలు