Fruits: పండ్లను సరైన రీతిలో తినటం వలన రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు

భోజనం తర్వాత లేదా ఖాళీ కడుపుతో పండ్లు తినకూడదు. అరటిపండు, పుచ్చకాయ, మామిడి పండ్లు, దోసకాయ, పైనాపిల్, నారింజ, నిమ్మకాయ తినే సమయంలో కొద్దిగా నల్ల ఉప్పు, పుదీన, ఏలకులు గింజలు, ఎండు అల్లం పొడి కలిపి తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

New Update

Fruits: ఆహారంలో పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. పండ్లలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర వహిస్తాయి. అయితే ఆయుర్వేదం ప్రకారం.. పండ్లు తినే విధానంలో కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. ఎందుకంటే పండ్లను తప్పుగా తినడం వల్ల అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తే అవకాశముంటుంది. ముఖ్యంగా భోజనం తర్వాత లేదా ఖాళీ కడుపుతో పండ్లు తినకూడదు. ఇవి శరీరంలో ఆమ్లతను పెంచే ప్రమాదం ఉంది. కానీ కొన్ని సహజ పదార్థాలతో కలిపి తింటే పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.

Also Read :  ఈ వంటల్లో జీలకర్ర వాడితే డేంజర్...రుచిపోవడమే కాదు.. ఆరోగ్యానికి కూడా..!

ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోటానికి..

అరటిపండులో ఫైబర్ పుష్కలంగా కలిగి ఉంటుంది. కొంతమందికి దీనివల్ల మలబద్ధకం ఏర్పడే అవకాశం ఉంటుంది. అటువంటి వారికి కొన్ని ఏలకులు గింజలతో కలిపి అరటిపండును తినమని సూచిస్తారు. ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. వేసవిలో మామిడి పండ్లు విస్తృతంగా లభింస్తాయి. కానీ మామిడిని అధికంగా తింటే కడుపులో గ్యాస్, శరీరంలో వేడి పెరిగే అవకాశముంది. దీన్ని నివారించాలంటే చిటికెడు ఎండు అల్లం పొడిని మామిడి తిన్న తర్వాత తీసుకోవాలి. ఇది జీర్ణాన్ని మెరుగుపరచడమే కాకుండా శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: స్నానంలో ఈ తప్పులు చేస్తే.. చర్మానికి డేంజర్‌ని తెలుసా..?

పుచ్చకాయ తినేప్పుడు చాలామంది దానికి నల్ల ఉప్పు కలిపి తింటారు. ఇది కేవలం రుచి కోసమే కాకుండా.. శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహించడంలో సహాయపడుతుంది. నల్ల ఉప్పులో ఉండే సోడియం శరీరానికి అవసరమైన సమతుల్యతను కలిగిస్తుంది. అలాగే దోసకాయను కూడా కొద్దిగా చాట్ మసాలాతో కలిపి తినాలి. ఇది వాతాన్ని సమతుల్యం చేస్తుంది, శరీరంలో సులభంగా జీర్ణమవుతుంది. పైనాపిల్, నారింజ, నిమ్మకాయ వంటి పండ్లు రుచిలో మాత్రమే కాకుండా పోషణలోనూ గొప్పవి. ఇవి వేసవిలో ఉత్సాహాన్ని కలిగించే ఫలాలు. వీటిని పుదీనాతో కలిపి తినడం ద్వారా శరీరానికి చల్లదనం లభిస్తుంది. ఈ విధంగా సరైన పదార్థాలతో పండ్లను కలిపి తినటం వలన వాటి గుణాలు రెట్టింపు అవుతాయి. అందువల్ల పండ్లను తినే విధానాన్ని మార్చుకొని ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read :  ముఖం ఫిట్‌గా, యవ్వనంగా కావలా..? అయితే ఈ మూడు వ్యాయామాలు ట్రై చేయండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద సవాలుగా ఉందా..? చిన్నచిన్న మార్పులతో ఆరోగ్యం


( fruits | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | telugu-news | latest-news )

Advertisment
తాజా కథనాలు