/rtv/media/media_files/2025/05/16/CHNGOepYaMNr6UI2WwjI.jpg)
Hari Hara Veera Mallu Release Date
Hari Hara Veera Mallu Release Date: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిత్రం 'హరి హర వీర మల్లు' సినిమా నుంచి బిగ్ అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాను 2025 జూన్ 12న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. క్రిష్ జాగర్లమూడి, ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం ఆధారంగా రూపొందించబడింది.
Also Read: BIG BREAKING: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!
GET READY FOR THE BATTLE OF A LIFETIME! ⚔️🏹
— Hari Hara Veera Mallu (@HHVMFilm) May 16, 2025
Mark your calendars for #HariHaraVeeraMallu on June 12, 2025! 💥 💥
The battle for Dharma begins... 🔥⚔️ #HHVMonJune12th #VeeraMallu #DharmaBattle #HHVM
Powerstar @PawanKalyan @AMRathnamOfl @thedeol #SatyaRaj @AgerwalNidhhi… pic.twitter.com/3KKNcspFIr
ముందే హింట్ ఇచ్చిన ప్రొడ్యూసర్
గతం లో సోషల్ మీడియా వేదికగా నిర్మాత తన ఆనందాన్ని పంచుకుంటూ.. “చిత్రీకరణ పూర్తయింది. ఇక థియేటర్లలో కలుసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అద్భుతమైన పాటలు, పవర్‌ఫుల్ ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయనున్నాం,” అని వెల్లడించారు.
Also Read: Andhra King Taluka: అదిరిపోయిన టైటిల్ గ్లింప్స్.. రామ్ కొత్త మూవీ టైటిల్ ఇదే
ఈ చిత్రం మొదటి నుంచి అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. గతంలో మే 9 విడుదల తేదీని ప్రకటించినప్పటికీ, షూటింగ్ పెండింగ్ ఉండటంతో విడుదలను మళ్ళీ రీషెడ్యూల్ చేశారు. అయితే, ఎట్టకేలకు జూన్ 12న విడుదల ఫిక్స్ చేసుకున్నాడు వీరమల్లు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. డబ్బింగ్, రీ-రికార్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జోరుగా కొనసాగుతోంది.
Also Read: ఇంతకీ 'NTR' ఎవరు..? నాల్గవ తరం వారసుడు పై నెటిజన్ల కామెంట్స్ హల్‌చల్!
ఈ చిత్రానికి తొలుత దర్శకుడుగా క్రిష్ జాగర్లమూడి పని చేయగా, తరువాత బాధ్యతలను నిర్మాత రత్నం కుమారుడు జ్యోతికృష్ణ స్వీకరించారు. ఇందులో చారిత్రాత్మక యోధుడిగా ఓ విభిన్నమైన, పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.