Techie Arrested : సిగ్గుందరా.. జై పాకిస్తాన్ అంటూ నినాదాలు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ అరెస్ట్!

మే 9న ఆపరేషన్ సిందూర్ విజయాన్ని జరుపుకుంటుండగా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ 25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను తన బాల్కనీ నుండి పాకిస్తాన్ అనుకూలంగా జై పాకిస్తాన్  నినాదాలు చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

New Update
pro-Pakistan slogans

pro-Pakistan slogans

మే 9న ఆపరేషన్ సిందూర్ విజయాన్ని జరుపుకుంటుండగా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ 25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను తన బాల్కనీ నుండి పాకిస్తాన్ అనుకూలంగా జై పాకిస్తాన్  నినాదాలు చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శుభాన్షు శుక్లాగా గుర్తించారు. ప్రశాంత్ లేఅవుట్‌లోని పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహంలో ఉంటూ నగరంలోని ఒక ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ గా పనిచేస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన మే 9న తెల్లవారుజామున 12:30 గంటల ప్రాంతంలో ప్రశాంత్ లేఅవుట్‌లో   శుభాన్షు శుక్లా మే 9న హాస్టల్ బాల్కనీ నుంచి పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశాడు. ఇలా మూడు సార్లు నినాదాలు చేశాడు.  

మరింత విచారణ కోసం కస్టడీలోకి 

ఇది గమనించిన ఓ స్థానికుడు మొబైల్‌లో రికార్డ్ చేసి 112 పోలీసు హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి, ఆ ఫుటేజీని అధికారులకు పంపించాడు.  సమాచారం అందుకున్న పోలీసులు..  అక్కడికి చేరుకుని శుభాన్షు శుక్లాను అదుపులోకి తీసుకున్నారు.  అతనిపై సెక్షన్ 353(3) (ప్రజలకు హాని కలిగించే ప్రకటనలు లేదా ప్రవర్తన), సెక్షన్ 152 (భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత సమగ్రతకు హాని కలిగించే చర్యలు), BNS ఇతర విభాగాల కింద కేసు నమోదు చేశారు. సంఘటన జరిగిన సమయంలో శుభాన్షు శుక్లా మద్యం సేవించి ఉన్నాడా లేదా మాదకద్రవ్యాల ప్రభావంలో ఉన్నాడా అని నిర్ధారించడానికి బ్లడ్ శాంపిల్స్ ను తీసుకున్నారు. మొదట మే 9న శుక్లాను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఆ తరువాత పోలీసులు మరింత విచారణ కోసం అతనిని కస్టడీని కోరారు. ఈ వారంలో బెంగళూరు నగరంలో జరిగిన రెండో అరెస్టు ఇది. అంతకుముందు, నవాజ్ అనే 25 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు.  

Also read :  Flash News :రూ.1200 పెరిగిన బంగారం... హైదరాబాద్ లో ఇప్పుడు తులం ఎంతంటే?

 india | pakistan | arrested | benguluru techie news | Pakistan slogans

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు