/rtv/media/media_files/2025/05/15/sno8mMjUppWKysmFy9DQ.jpg)
Same Sex Marriage UP
Same-Sex Marriage UP: సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు. వేర్వేరు జెండర్లు(Different Genders) కాకుండా సేమ్ జెండర్లు(Same Genders) పెళ్లి చేసుకుంటున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. అబ్బాయిలు అంటే ఇష్టం లేకపోవడం, వారిని నమ్మలేకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది అమ్మాయిలు ఇలా పెళ్లి చేసుకుంటున్నారు. అయితే యూపీలో(UP) ఇద్దరు అమ్మాయిలు పెళ్లి(Two Girls Marry) చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని బదాయూ కోర్టు ప్రాంగణంలో ఉన్న ఓ శివాలయం దగ్గర దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు.
ఇది కూడా చూడండి: Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్
ఉత్తరప్రదేశ్‌లో న్యాయవాదుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు
— RTV (@RTVnewsnetwork) May 15, 2025
తమకు పురుషులు అంటే ఇష్టం లేదని.. మూడు నెలల నుండి కలిసి ఉన్నామని పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు
బదాయూ కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో దండాలు మార్చుకొని పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు#UttarPradesh #viralvideo… pic.twitter.com/V9Qi7mG021
ఇది కూడా చూడండి: Ind-Pak war: చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు 23 నిమిషాల్లోనే ధ్వంసం..కేంద్రం
పురుషులను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని..
పురుషులను పెళ్లి చేసుకోవడం తమకు ఇష్టం లేదని, అందుకే ప్రాణ స్నేహితులుగా ఉన్న మేం పెళ్లి చేసుకుంటున్నామని ఆ అమ్మాయిలు తెలిపారు. సుప్రీం కోర్టు స్వలింగ వివాహాన్ని అనుమతించదు.. అయినా కూడా మేం భార్యాభర్తలుగా కలిసే ఉంటామని తెలిపింది. ఈ పెళ్లిని మా కుటుంబాలు ఒప్పుకుంటే పర్లేదు. లేకపోతే వారితో కూడా సంబంధాలను తెంచుకుంటామని ఆ ఇద్దరు అమ్మాయిలు తెలిపారు. జీవితంలో సంతోషంగా ఉండటానికి ఇద్దరి పెళ్లి చేసుకున్నారని, తమని భార్యాభర్తలుగా కలిసి జీవించడానికి అవకాశం ఇవ్వాలని లాయర్‌ను కోరుకున్నారు.
ఇది కూడా చూడండి: Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు