PAK: భారత్ తో శాంతి చర్చలకు సిద్ధం..పాక్ ప్రధాని

భారత్ తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఈ చర్చల్లో కాశ్మీర్ అంశం కూడా ఉంటుందని స్పష్టం చేశారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని కమ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

New Update
Pakistan PM Shehbaz Sharif

Pakistan PM Shehbaz Sharif

భారత్ శాంతి చర్చలకు రావాలని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు. భారత్ తో చర్చలలో కాశ్మీర్ అంశం కూడా ఉంటుందని ఆయన చెప్పారు. జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్‌ పదేపదే స్పష్టం చేస్తున్నా షరీఫ్ మళ్ళీ కాశ్మీర్ గురించి చర్చల చేయాలని అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పంజాబ్ ప్రావిన్స్‌లోని కమ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. షెహబాజ్ తో పాటు ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఎయిర్ స్టాఫ్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ వైమానిక స్థావరాన్ని సందర్శించారు.

చర్చలకు ఓకే..

మరోవైపు ఒక్క బుల్లెట్ కూడా పేల్చకూడదని...బోర్డర్ల నుంచి సైన్యాన్ని వెనక్కు మళ్లించాలని ఇరు దేశాల డీజీఎమ్వోలు నిర్ణయించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. అయితే కాశ్మీర్ లేదా సింధు జలాలపై ఒప్పందంపై ఎలాంటి చర్చలు జరగవని స్పష్టం చేసింది. మే 10, 12వ తేదీల్లో జరిగిన హాట్ లైన్ చర్చలపై ఇండియన్ ఆర్మీ ప్రకటన చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. మే 10 శనివారం సాయంత్రం భూమి, వాయు, సముద్రంలో అన్ని కాల్పులు.. సైనిక చర్యలను నిలిపివేయడానికి ఒప్పందం కుదిరింది. నాలుగు రోజులు తీవ్రమైన దాడుల తర్వాత రెండు దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మే12న మధ్యాహ్నం నాలుగు గంటలకు డీజీఎమ్వోలు మళ్ళీ మాట్లాడుకున్నాయి. 

today-latest-news-in-telugu | Pakistan PM Shabaz Sharif | india | peace 

Also read :   Jai Shankar: పాక్ ఆరోపణలను ఖండించిన ఆఫ్ఘాన్..థాంక్స్ చెప్పిన జైశంకర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు