Virat Vs Bcci:  టెస్టు కెప్టెన్సీ ఇవ్వనందుకే కోహ్లీ రిటైర్మెంట్.. బీసీసీఐతో విభేధాలు!?

విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ రిటైర్మెంట్‌పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ వీడ్కోలు తర్వాత ఇంగ్లాండు టూర్ కు కోహ్లీనే కెప్టెన్సీ చేయాలనుకున్నాడట. కానీ బీసీసీఐ కొత్త సారథికి మొగ్గుచూపడంతో కోహ్లీ టెస్టులనుంచి వైదొలిగినట్లు సమాచారం. 

New Update
Virat Kohli Records

Virat Kohli in dispute with BCCI over Test captaincy

విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ రిటైర్మెంట్‌పై ఆసక్తికర విషయం చర్చనీయాంశమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ వీడ్కోలు తర్వాత ఇంగ్లాండు టూర్ కు కోహ్లీనే కెప్టెన్సీ చేయాలనుకున్నాడట. కానీ బీసీసీఐ మాత్రం కొత్త సారథికి మొగ్గుచూపడంతో నొచ్చుకున్న కోహ్లీ టెస్టులనుంచి తొలిగినట్లు సమాచారం. 

Also Read :  రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

Virat Kohli In Dispute With BCCI

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా పరిగణించబడే కోహ్లీ.. భారతదేశ విజయవంతమైన కెప్టెన్‌గా పేరుగాంచాడు. అయితే టెస్టు ఫార్మాట్ నుండి రిటైర్ కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ నిర్ణయంపై ఇప్పటికే చాలా ఊహాగానాలు ఉన్నప్పటికీ.. బీసీసీఐ అతన్ని మరోసారి కెప్టెన్‌గా నియమించకూడదని భావించిందట. కానీ కోహ్లీ మాత్రం రోహిత్ వీడ్కోలుతో తనకు కెప్టెన్సీ ఇస్తారని భావించాడట. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా విరాట్ మరోసారి కెప్టెన్ బాధ్యతలు తీసుకుంటాడని జోరుగా ప్రచారం జరిగింది.  కానీ ఇప్పుడు ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి.

Also Read :  ఆల్కహాల్ బ్రాండ్ కి బాలయ్య యాడ్.. పద్మ భూషణ్ తిరిగి ఇవ్వాలంటూ నెటిజన్ల ట్రోలింగ్! వీడియో వైరల్

సొంత గడ్డపై న్యూజీలాండ్ చేతిలో, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 3--1 తేడాతో ఓడిపోయింది. దీంతో బీసీసీఐ పూర్తిగా యూ-టర్న్ తీసుకుంది. కొత్త కెప్టెన్ కోసం వెతకడం ప్రారంభించింది. కానీ విరాట్ మాత్రం మళ్లీ భారత టెస్టు క్రికెట్ కు పునర్వభైవం తీసుకురావాలని కలగన్నాడట. ఢిల్లీ తరపున రైల్వేస్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అతను ఆడటానికి అదే ప్రధాన కారణాలలో ఒకటిగా చెప్పుకుంటున్నారు.

Also Read :  ఐఫోన్ డిజైన్‌తో కొత్త ఫోన్.. కేవలం రూ.10 వేల లోపే!

Also Read :  అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌కు బిగ్ షాక్.. కేంద్రం నోటీసులు

: virat-kohli | captain | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు