Nandamuri New Hero: ఇంతకీ 'NTR' ఎవరు..? నాల్గవ తరం వారసుడు పై నెటిజన్ల కామెంట్స్ హల్‌చల్!

"NTR" అనగానే ఒకప్పుడు నందమూరి తారక రామారావు గుర్తు వచ్చేవారు. తర్వాత జూనియర్ NTR గుర్తింపు పొందాడు. తాజాగా నాల్గవ తరం వారసుడు కూడా అదే పేరుతో ఎంట్రీ ఇవ్వడంతో, నెటిజన్లు సరదాగా "Jr Jr NTR, Mini NTR, NTR³" వంటి కామెంట్లతో హంగామా చేస్తున్నారు.

New Update

Nandamuri New Hero: తెలుగు సినీ రాజకీయ రంగాల్లో "NTR" అంటే ఒకే ఒక్క వ్యక్తి గుర్తుకు వచ్చేవారు - నందమూరి తారక రామారావు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొదట ఆయన తనయుడు హరికృష్ణ తనయుడు తారక్ (Jr NTR) సినీ రంగ ప్రవేశంతో ‘జూనియర్ NTR’గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో జూనియర్ NTR సూపర్‌స్టార్ గా వెలుగొందుతున్నాడు.

Also Read: BIG BREAKING: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!

ఇప్పుడు మళ్లీ అదే పేరుతో నందమూరి కుటుంబంలో నాల్గవ తరం నుంచి మరో వారసుడు, సినీ రంగ ప్రవేశానికి సిద్ధమయ్యాడు. జనకిరామ్ కుమారుడు, హరికృష్ణ మనవడు, తాజాగా తెరపైకి వచ్చిన తారక రామారావు పేరు కూడా NTRగానే ఉండటంతో, సోషల్ మీడియాలో వినూత్న రియాక్షన్లు వెల్లువెత్తుతున్నాయి.

దీని పై నెటిజన్లు స్పందిస్తూ..

“ఇప్పుడేం పిలవాలి? Jr Jr NTRనా?”, “ Sub Jr NTR, Mini NTR, NTR³ లాంటి పేర్లే బెటర్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది అయితే, సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లా - “NTR, Jr NTR, Mini NTR, Micro NTR…” అని కూడా పిలవొచ్చని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

NTR
NTR

 Also Read: 'ఈట్.. స్లీప్.. సలార్'.. బొమ్మ వచ్చి 500 రోజులు దాటినా ఊపు తగ్గలేదుగా!

ఇలా సరదాగా సోషల్ మీడియా లో కామెంట్లు చేస్తున్న, ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది -‘NTR’ అనే పేరు, తరతరాలుగా తెలుగు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటూనే ఉంది. ఇప్పుడు ఆ పేరు మరో తరం ద్వారా రీబ్రాండ్ అవుతోంది. ఈ కొత్త తరం NTR ఏ రీతిలో ఆకట్టుకుంటాడో చూడాలి!

Also Read: ఈ రేంజ్ కలెక్షన్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా! #సింగిల్ వరల్డ్ వైడ్ ఎంతంటే..?

 

latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news

Advertisment
Advertisment
తాజా కథనాలు