Ration Card : రేషన్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త.. ఒకేసారి 3 నెలల రేషన్!

రానున్న వర్షాకాలన్ని దృష్టిలోపెట్టుకుని కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇవ్వనున్న 3 నెలల ఆహారపదార్థాలను ముందుగానే తీసుకుని పంపిణీ చేయాలని సూచించింది.

New Update
ration cards tg

3 months of ration at once

 Ration Card : రానున్న వర్షకాలన్ని దృష్టిలోపెట్టుకునికేంద్రం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్‌ నుంచి మొదలయ్యే వర్షాకాలం, వరదల వంటివి రాష్ట్రాలకు అడ్డంకులుగా మారే అవకాశం ఉంటుంది కనుక కేంద్రం ముందుస్తు సూచన చేసింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇవ్వనున్న ఆహారపదార్థాలను ముందుగానే తీసుకుని పంపిణీ చేయాలని సూచించింది. వర్షకాలం ధాన్యం నిలువ, పంపిణీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నందున మూడునెలల కోటాను తీసుకుని ఒకేసారి పంపిణీ చేయాలని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: స్నానంలో ఈ తప్పులు చేస్తే..చర్మానికి డేంజర్‌ని తెలుసా..?

Good News For Ration Cards

జాతీయ ఆహార భద్రత చట్టం కింద రాష్ర్టాలకు పంపిణీ చేయాల్సిన ఆహార పదార్థాలను ఆగస్టు 2025 వరకు ముందస్తుగానే తీసుకుని మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది.ఈ విషయమై  అన్ని రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శులకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాహుల్‌ సింగ్‌ లేఖ రాశారు. మే 30లోగా జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన సరకును లబ్ధిదారులకు అందించాలని పేర్కొన్నారు. ముందస్తు బియ్యం తీసుకుని, పంపిణీ లో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోడౌన్లలో తగినంత నిల్వలు ఉండేలా చూసుకోవాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వా లతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్త ర్వులు తక్షణం అమల్లోకి వస్తాయన్నారు.

ఇది కూడా చూడండి: RRR 2: చరణ్, తారక్.. జక్కన్నను ఎలా ఆటపట్టించారో చూడండి.. RRR 2 పై రాజమౌళి రియాక్షన్! (వీడియో)

ఇక ఇప్పటికే ఏప్రిల్‌ నెల రేషన్‌ బియ్యం పంపిణీ పూర్తి అయినందున వచ్చే జూన్‌లో వచ్చే జూన్‌లో మూడు నెలల కోటాను విడుదల చేస్తామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రేషన్‌ షాపులకు ప్రతినెలా 1.75 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తుండగామూడు నెలలకు గాను సుమారు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం పడుతాయి, ఇక రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నందున ఎఫ్‌సీఐ గోడౌన్‌ల నుంచి సన్న బియ్యం నిల్వలను సమీకరించనున్నది. మూడు నెలల రేషన్‌ కోటాను వచ్చే నెలలో ఒకేసారి విడుదల చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.  

Also Read: KINGDOM: రౌడీ స్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. 'కింగ్ డమ్' రిలీజ్ లేదు!

Also Read :  వేసవిలో చల్లదనాన్ని పంచే మామిడి ఫలూదా.. దీనిని సింపుల్‌గా ఇలా చేసుకోండి

 

rice | ration-shops | ap govt key decision on ration cards | ration-cards

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు