Sivakarthikeyan Madharasi
Sivakarthikeyan Madharasi: శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న తమిళ యాక్షన్ థ్రిల్లర్ ‘మధరాసి’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కథను కూడా ఆయనే రచించారు. సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉంది. మేకర్స్ ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్‌ను పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. తాజా సమాచారం ప్రకారం, ‘మధరాసి’ యూనిట్ తదుపరి షెడ్యూల్‌ను శ్రీలంకలో ప్లాన్ చేసింది. అక్కడి చిత్రీకరణతో సినిమా పూర్తవుతుందని చెబుతున్నారు.
Also Read: BIG BREAKING: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!
హిందీలో ‘దిల్ మధరాసి’గా
ఇక ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. తమిళంతో పాటు, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ‘మధరాసి’ ఒకేసారి థియేటర్లకు రానుంది. హిందీ భాషలో మాత్రం ఈ సినిమాను ‘దిల్ మధరాసి’ అనే టైటిల్‌తో విడుదల చేయనున్నారు. దక్షిణాది మార్కెట్‌తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఈ మూవీ ఆకర్షించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తోంది.
Also Read: Andhra King Taluka: అదిరిపోయిన టైటిల్ గ్లింప్స్.. రామ్ కొత్త మూవీ టైటిల్ ఇదే
తారాగణం విషయానికి వస్తే, రుక్మిణి వసంత ఈ సినిమాలో కథానాయికగా కనిపించనుంది. మెయిన్ విలన్ గా విద్యుత్ జమ్వాల్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతాన్ని అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్నారు. శివకార్తికేయన్ - అనిరుధ్ కాంబినేషన్ ఇప్పటికే అనేక హిట్ ఆల్బమ్స్‌ను అందించింది. ‘మధరాసి’ పాటలు కూడా అందరిని ఆకట్టుకునేలా ఉండనున్నాయి.
Also Read: ఇంతకీ 'NTR' ఎవరు..? నాల్గవ తరం వారసుడు పై నెటిజన్ల కామెంట్స్ హల్‌చల్!
సెప్టెంబర్ 5, 2025న ‘మధరాసి’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మురుగదాస్ దర్శకత్వం, శివకార్తికేయన్ యాక్షన్, అనిరుధ్ సంగీతం, ఈ ముగ్గురి కాంబినేషన్ వల్ల సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ యాక్షన్, థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకం తో ఉన్నారు.