/rtv/media/media_files/2025/04/13/KzqNbqSx1x6pdUqMRefV.jpg)
Earthquake
2025 మే 16 శుక్రవారం రోజున చైనాలో భూకంపం సంభవించింది. 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టంకానీ జరగలేదు. అయితే భూకంపం ప్రకంపనలకు చైనా ప్రజలు భయపడి, ఇళ్లలోంచి బయటకు పరుగులు తీయడం ప్రారంభించారు. చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి.
EQ of M: 4.5, On: 16/05/2025 06:29:51 IST, Lat: 25.05 N, Long: 99.72 E, Depth: 10 Km, Location: China.
— National Center for Seismology (@NCS_Earthquake) May 16, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/08mQNfOwyd
ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం
మరోవైపు శుక్రవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్‌లో 4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం 00:47:40 ISTకి సంభవించింది, దీని కేంద్రం 36.56°N అక్షాంశం, 70.99°E రేఖాంశం వద్ద, 120 కిలోమీటర్ల లోతులో ఉంది. కాగా గురువారం తెల్లవారుజామున టర్కీలోని కోన్యా నగరంలో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టంకానీ జరగలేదు.